షిర్డీ కొత్త సంప్రదాయం... రక్త దానంతో ప్రత్యేక దర్శనం

Published : Jun 22, 2017, 12:56 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
షిర్డీ కొత్త సంప్రదాయం... రక్త దానంతో ప్రత్యేక దర్శనం

సారాంశం

షిర్డీలో  ప్రత్యేక దర్శనం కోసం క్యూలో నిలబడాల్సిన పని లేదు. ప్రత్యేకంగా టికెట్టు కొననవసరంలేదు. చేయాల్సిందంతా ఒక చన్నపనే. మంచి పని. అది రక్త దానం. ‘‘రక్తదానం చేయండి... వీఐపీ దర్శనం పొందండి’’అనేది ఇపుడు షిర్డీ సంస్థాన్ కొత్త నినాదం.

షిర్డీ ఆలయంలో బాబా దర్శనానికి ఒక కొత్త సంప్రదాయం ప్రవేశపెడుతున్నారు. బాబా ప్రత్యేక దర్శనం కావాలసిన వారు ఇక ముందు క్యూలో నిల్చబడి, వేచి చూసి విసిగి వేసారి  పోవాల్సిన పని ఉండదు.

ప్రత్యేక దర్శనం కోసం ప్రత్యేకంగా టికెట్టు కొననవసరంలేదు.

చేయాల్సిందంతా ఒక చన్నిపనే. అది రక్త దానం.

‘‘రక్తదానం చేయండి... వీఐపీ దర్శనం పొందండి’’అనేది ఇపుడు షిర్డీ సంస్తాన్ కొత్త నినాదం.

మానవ శ్రేయస్సు కోసం ఈ కొత్త  పద్థతి ప్రవేశపెడుతున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు చైర్మన్‌ సురేశ్‌ హారే మీడియాకు వెల్లడించారు.

తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్లే.. షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయడం ఆనవాయితీగా మారుస్తామన్నారు.

రక్తదానం పవిత్రమయినది, ఇది ఒక మనిషికి జీవం పోస్తుంది.  భక్తులు రక్తదానంతో మానవతా దృక్పథం అలవర్చుకోవాలని చాటేందుకు ఈ పని చేస్తున్నామని, ఇది రక్తదాతకు ఎంతో  సంతృప్తి నిస్తుందని ఆయన అన్నారు.

షిర్డీని బ్లడ్‌ బ్యాంక్‌ హబ్‌గా మార్చడం తమ ఉద్దేశమని హారె తెలిపారు.  

షిర్డీ సాయినాధుని దర్శనానికి వెళ్లిన వారు రక్తదానం చేయడం ద్వారా ఒక ఏడాదిపాటు ఆలయంలో వీఐపీ హోదాలో దర్శనం ఉండటంతోపాటు సత్రాల్లో బస విషయంలో కూడా వీఐపీ తరహాలోనే ఏర్పాటు చేస్తారని చెప్పారు ట్రస్టు చైర్మన్.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !