ఈ కలెక్టర్ ధైర్యానికి చప్పట్లు కొట్టండి...

Published : Mar 18, 2017, 04:52 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
ఈ కలెక్టర్ ధైర్యానికి చప్పట్లు కొట్టండి...

సారాంశం

కలెక్టర్ కుబుసం వదిలేసి  ప్రభుత్వ వ్యవస్థలో  తానూ భాగమయ్యేందుకు భూపాల్ పల్లి కలెక్టర్  ధైర్యంగా ఒక ప్రయత్నం చేశారు

ప్రభుత్వాఫీసర్లలో మంచోళ్లుంటారు, చెడ్డోళ్లుంటారు, పర్వాలేదుగారుంటారు.

 

చివరి రెండు జాతులొదిలోస్తే చాలామంది మంచోళ్ల వల్ల  కూడా పెద్దగా వ్యవస్థకు  మేలు జరగదు.

 

ఎందుకంటే, వీళ్లు చక్కగా వాళ్ల పనిచేసుకుంటూ పోతుంటారు. బయట ప్రపంచం ఎలాపోతున్నది పెద్ద గా పట్టించుకోరు. మనపని మనం మంచిగా చేస్తున్నాం  అంతేచాలు, అనుకుంటుంటారు. అందుకే ప్రభుత్వంలోని వ్యవస్థ (ఇన్స్ స్టిట్యటూషన్) ల మీద ప్రజలలో విశ్వాసం పెరగడంలేదు. కారణమేమంటే, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఈ ఇన్ స్టిట్యూషన్స్ కి బయట బతుకుతుంటారు. వీటిలో వీళ్లెపుడూ భాగస్వాములు కారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూన్నా వీటికి దూరంగా బతకుతుంటారు. వీళ్లకి వైద్యం ప్రయివేటు, వీళ్లచదువులు ప్రయివేటు... ఇలా న్యాయం ప్రయివేటు, ప్రభుత్వం సేవలవసరయినా హోదా వల్ల అన్నీ సమకూరుతాయి.

 

25 సంవత్సరాలుగా వైద్యశాఖ మంత్రులు,  వైద్య శాఖ కార్యదర్శులు, వైద్యకళాశాల ల ప్రిన్సిపాళ్లు, వైద్యాధికారులు...  ప్రచారం చేస్తున్నదొక్కటే, ఇన్ స్టిట్యూషనల్ డెలివరీస్ (ఆసుపత్రులలో కాన్పులు) జరగాలని. అయినా ఇది నెరవేడం లేదు. దానికి తోడు ఆసుప్రతి అంటే ప్రయివేటు ఆసుపత్రి అని అర్థం ఏర్పడింది. ఇలాంటపుడు జైశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్ మురళి నెలలు నిండిన తనకూతురు ప్రగతిని, ధైరాయిడ్ సమస్య ఉన్నా,  హైదరాబాద్ నుంచి ఏకంగా మారు మూలు ములుగు ప్రభుత్వాసుప్రతికి తీసుకువచ్చారు. ప్రసవం చేయించారు. మనవరాలినిముద్దాడారు. ప్రసవం క్రిటికల్‌ కావచ్చని  హెచ్చరించినా వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచేందుకు కలెక్టర్‌ ఆకునూరి మురళి చేసిన ప్రయత్నం బాగా దోహదపడుతుంది. అనుమానం లేదు.

 

అయితే, ఇదొక్కటే చాలదు, అసుపత్రులకు కలెక్టర్ మురళి వెళ్లినంత ధైర్యంగా సాధారణ బడుగుజీవులు వెళ్లగలిగాలి, కలెక్టర్ కూతురుకు దొరికినంత వైద్యం చిన్నాచితక జనానికి దొరకాలి. డిఎంహెచ్ వొ దగ్గరుండి పురుడు పోయకపోయినా, అసుప్రతిలో  పేదల పట్ల సేవాగుణం కనబడితే చాలు, అపుడే బంగారు తెలంగాణా వస్తున్నట్లు లెక్క.

 

ఏమయినా కలెక్టర్ మురళీ  ప్రభుత్వం వ్యవస్థ బయటకాకుండా,  వ్యవస్థలోనే బతికేందుకు ధైర్యంగా ప్రయత్నం చేశారు. చప్పట్లు కొట్టాల్సిందే.

 



 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !