పాక్ లో హోరెత్తుతున్న గాయత్రి మంత్రం(వీడియో)

First Published Mar 18, 2017, 2:04 AM IST
Highlights

రెండు నిముషాలపాటు మాలిని ఆలపించిన గాయత్రీ మంత్రం ప్రభావమో ఏమో గానీ షరీఫ్ తో పాటు పలువురు మతపెద్దలు, మంత్రులు, ఉన్నతాధికారులు మంత్రముగ్దులైపోయారు.

పాకిస్ధాన్లో గాయత్రిమంత్రం హోరెత్తిపోతోంది. నమ్మలేకున్నారు. నిజంగా నిజమే. మొన్న హోలీ పండుగ రోజున కరాచీలోని హిందువులందరూ కలిసి పండుగను జరుపుకున్నారు. మతసామరస్యాన్ని చాటేందుకని పాకిస్ధాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తదితరులు కూడా హాజరయ్యారు. వేదికమీద ప్రధానితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా కూర్చున్నారు. సమావేశానికి వందల సంఖ్యలో ముస్లిం పెద్దలు, స్ధానికులు కూడా హాజరయ్యారు. ఇక, నవాజ్ షరీఫ్ మాట్లాడేందుకు రెడీ అవుతున్నారు.

 

ఇంతలో సమవేశానికి హాజరైనవారిలో ఒక హిందు యువతి సరోదా మాలిని వేదికమీదకు చేరుకున్నారు. నిర్వాహకుల అనుమతి తీసుకున్నారు. వెంటనే గాయత్రీమంత్రాన్ని మొదలుపెట్టారు. దాంతో ఒక్కసారిగా కలకలం. పాకిస్ధాన్ లో గాయత్రీమంత్రమా? అదికూడా బహిరంగంగా? అందులోనూ ప్రధాని, మత పెద్దలు పాల్గొన్న ఓ వేదికపైన. అంతా ఆశ్చర్యంగా చూస్తున్నంతలోనే మాలిని గాయత్రి మంత్రాన్ని మొదలుపెట్టేసారు. దాంతో ఒక్కసారిగా సభలో సైలేన్స్. షరీఫ్ కూడా మాలినినే చూస్తున్నారు.

 

రెండు నిముషాలపాటు మాలిని ఆలపించిన గాయత్రీ మంత్రం ప్రభావమో ఏమో గానీ షరీఫ్ తో పాటు పలువురు మతపెద్దలు, మంత్రులు, ఉన్నతాధికారులు మంత్రముగ్దులైపోయారు. మాలిని గాయత్రి చదవుతున్నంతసేపు పరవశించి ఆమెనే చూస్తుండిపోయారు. మంత్ర పఠనం అయిపోగానే ఒక్కసారిగా సభికుల నుండి తప్పట్లే తప్పట్లు..

 

 

click me!