పెళ్ళిళ్లు చేసే పూజార్లకే.. పెళ్లి కావడం లేదు

Published : Oct 19, 2017, 04:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
పెళ్ళిళ్లు చేసే పూజార్లకే.. పెళ్లి కావడం లేదు

సారాంశం

పెళ్లిళ్లు కాక ఇబ్బంది పడుతున్న పురోహితులు పురోహితులను పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయం చేస్తానంటున్న ప్రభుత్వం

ఇంట్లో ఎవరికైనా పెళ్లి కుదరకపోతే.. వెంటనే ఎవరైనా మంచి పూజారి దగ్గరకి వెళ్లి సమస్య ఏమిటో అడిగి తెలుసుంటాం. వాళ్లు జాతకంలో దోషం ఉందనో.. ఇంకోటి ఇంకోటి కారణమేదైనా చెప్పి.. పూజలు, హోమాలు చేయిస్తారు. తర్వాత పెళ్లి కుదిరినా.. వీరే దగ్గర ఉండి మరీ పెళ్లి చేస్తారు. అయితే.. పెళ్లిలో మంత్రాల సహాయం చేసే పూజార్లకే ఇప్పుడు పెళ్లిల్లు కావడం లేదు.

మంత్రాలు చదివే వారిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదు. దీంతో వారి బాధను తీర్చడానికి తెలంగాణ  ప్రభుత్వం నడుంబిగించింది. పూజారులు, పురోహితుల్ని పెళ్లి చేసునకుంటే.. పెళ్లయిన తర్వాత దంపతుల పేర రూ.3లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.

 అదేవిధంగా నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియంబస్ మెంట్ పథకం కూడా వర్తింపజేయనున్నారట. నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద బ్రాహ్మణులకు అత్యవసర వైద్య ఖర్చుల కోసం రూ.5లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వ సలహాదారు రమణాచారి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !