మహిళలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్న ఎంపీ ప్రభుత్వం

First Published Oct 19, 2017, 3:32 PM IST
Highlights
  • మహిళలను డ్రైవింగ్ నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్న ఎంపీ ప్రభుత్వం
  • ఇందు కోసం ప్రత్యేకంగా  క్యాంపైన్ చేపట్టనున్న ప్రభుత్వం

రాష్ట్రం లోని మహిళలంతా డ్రైవింగ్ నేర్చుకునేలా  మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది. మహిళలు డ్రైవింగ్ నేర్చుకొని.. లెసైన్స్ పొందేలా చేయాలని చూస్తోంది.

ఇందులో భాగంగానే ప్రభుత్వం ‘ ఆవో బయ్యా తుమే సెయిర్ కరూ’ అనే ప్రచార కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుంది.  అన్నా-చెల్లెల్ల బంధాన్ని తెలియజేసే భాయ్ దూజ్ పండగ రోజున ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఆ రాష్ట్ర మంత్రి అర్చన తెలిపారు.

మహిళలకు, యువతులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేసేలా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చవాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పట్టణీకరణ పెరిగిందంటే.. మహిళల్లో చైతన్యం మరింత పెరిగిందని అర్థమని మంత్రి అర్చన అన్నారు.

తాత్కాలిక డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా అందజేస్తామని అది 6నెలల పాటు పనిచేస్తుందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళలకు డ్రైవింగ్ నేర్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా94 ఇనిస్టిట్యూట్ లు ఉన్నాయని ఆమె చెప్పారు. ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత దానిని వృత్తిగా కూడా ఎంచుకోవచ్చని ఆమె సూచించారు. దీనికి కూడా ఆపరేషన్ డ్రైవింగ్ శౌర్య పేరిట మరో కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నామని చెప్పారు దానిని నవంబర్ 1వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ( అంతర్జాతీయ మహిళల దినోత్సవం) వరకు కొనసాగిస్తామని మంత్రి వివరించారు.

click me!