ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా.. ?

Published : Feb 10, 2017, 09:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా.. ?

సారాంశం

కొత్త రికార్డులు సృష్టించిన టీంఇండియా, కోహ్లీ

బంగ్లాదేశ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టెస్టులో టీం ఇండియా తో పాటు కెప్టెన్ కొహ్లీ రికార్డులు బద్దలు కొట్టారు.

 

ఆట రెండు రోజు  భారత్ 600 పరుగులకు చేరగానే ఈ ఘనత సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో వరుస మ్యాచ్‌ల్లో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక జట్టుగా భారత్ కొత్త రికార్డును సృష్టించింది.

 

భారత్ ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో రెండు సార్లు,  ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో బంగ్లాపై ఒకసారి 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసింది.

 

మరోవైపు కోహ్లీ కూడా తానేమీ తక్కువకాదని పాత రికార్డులను తిరగరాశాడు. ప్రస్తుత క్రికెటర్లలో దూకుడు మీద ఉన్న ఈ టీం ఇండియా కుర్ర కెప్టెన్ డబుల్ సెంచరీ చేసి దిగ్గజాల సరసన చేరాడు.

 

గతేడాది టెస్టుల్లో మూడు త్రిపుల్ సెంచరీలో చేసిన కోహ్లి ఈ ఏడాది ఇంకా ముగియకముందే రెండు చేశాడు.

 

గతేడాది మూడు టెస్టు సిరీస్‌ల్లో (వెస్టిండీస్‌పై 200, న్యూజిలాండ్‌పై 211, ఇంగ్లండ్‌పై 235)  డబుల్ సెంచరీలు చేసిన కోహ్లి..  ఇప్పుడు బంగ్లా తో జరుగుతున్న టెస్టులోనూ  204 పరుగులు చేశాడు.

 

దీంతో వరుసగా నాలుగు సిరీస్‌ల్లో డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. గతంలో బ్రాడ్‌మన్‌, ద్రవిడ్‌ మూడు వరుస సిరీస్‌ల్లో డబుల్స్ చేశారు. బంగ్లాపై డబుల్ సెంచరీతో కోహ్లి కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !