‘జగన్’ మీద కోడిగుడ్లతో దాడి

Published : Aug 10, 2017, 03:30 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
‘జగన్’ మీద కోడిగుడ్లతో దాడి

సారాంశం

నెల్లూరు పట్టణంలో టిడిపి నేతలు జగన్ మీద ఇలా కసితీర్చుకున్నారు

చంద్రబాబునాయుడిపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు, నేతలు నుడా చైర్మన్ కోటం రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపి తమ కసి తీర్చుకున్నారు.

ఒక వ్యక్తికి జగన్ వేషం వేసి నిలబెట్టారు. ఆయన మీదకు  కోడిగుడ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. జగన్ గత వారంలో జగన్ నంద్యాలలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు ను రోడ్డుమీద నిలబెట్టి కాల్చినా పాపం లేదు అన్ని అన్నాడని, అందుకే దీనికి ఈ విధంగా నిరసన తెలుపుతున్నామని టిడిపి నేతలు చెప్పారు.

ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ  జగన్మోహన్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్టాభివ్రుద్దికోసం అహర్నిశలు క్రుషి చేస్తున్న చంద్రబాబు నాయుడ్ని కాల్చేయాలనడం ఆయన నేర ప్రవృతకి నిదర్శమన్నారు. బజారు రౌడీలు అంతిమంగా జనంచేతిలో ఇలా తన్నులు తింటారని ఆయన అన్కారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !