పరెడ్ గ్రౌండ్  ఆకర్షణ కోల్పోనుందా?

Published : Aug 10, 2017, 02:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
పరెడ్ గ్రౌండ్  ఆకర్షణ కోల్పోనుందా?

సారాంశం

ఎస్పీ రోడ్డు నుంచి హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వరకు స్కై లైన్ ని అధికారులు నిర్మించ తలపెట్టారు. ఈ రోడ్డు విస్తరణ పనులు చేపడితే..  స్థూపానికి, రహదారికి మధ్య దూరం తగ్గిపోతుంది.

 

 పరెడ్ గ్రౌండ్ తన అందాన్ని కోల్పోనుందా.. అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. స్ట్రాటజిక్ రోడ్ అండ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల నగరంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దీనిలో భాగంగా  పరెడ్ గ్రౌండ్ భూమిని కూడా రోడ్ల విస్తరణకు ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఎస్పీ రోడ్డు నుంచి హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వరకు స్కై లైన్ ని అధికారులు నిర్మించ తలపెట్టారు. దీంతో ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు.

కాగా.. ఈ రోడ్డు విస్తరణ జరగాలంటే.. పరెడ్ గ్రౌండ్స్ లో కొంత భూమిని కోల్పోవాల్సి వస్తుంది. పరెడ్ గ్రౌండ్స్ లోని గోడ నుంచి 20 మీటర్లు.. అంటే దాదాపు 70 అడగుల మేర రోడ్డు విస్తరణకి అవసరమౌతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

పరెడ్ గ్రౌండ్స్ లో సైనికుల స్మారక స్థూపం ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్థూపం.. మొయిన్ రోడ్డుకు 100 అడుగుల దూరంలో ఉంటుంది. ఈ రోడ్డు విస్తరణ పనులు చేపడితే..  స్థూపానికి, రహదారికి మధ్య దూరం తగ్గిపోతుంది.  ప్రత్యేక సందర్భాలలో ఆర్మీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తూ  ఉంటారు. దీని వల్ల పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోనూ యుద్ధంలో మరణించిన ఆర్మీ జవానుల  స్మారక స్థూపం ఒకటి ఉంది. అది కూడా రోడ్ల విస్తరణలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

1984లో ఈ స్థూపానికి అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు.  పరెడ్ గ్రౌండ్ మొత్తం 23 ఎకరాలలో ఉందని సమాచారం. దానిని ఇప్పుడు స్కైవే నిర్మాణం కోసం మార్పులు చేస్తున్నారు.

మొత్తం రెండు స్కైవే నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొదటిది పారడైజ్ నుంచి బోయినపల్లి క్రాస్ రోడ్స్ వరకు వేయనున్నారు. రెండోది ఎస్పీ రోడ్డు నుంచి  హకీంపేట  ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వరకు వేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !