క్షుద్రపూజల్లోకి లోకేష్ ని లాగుతారా?

First Published Jan 2, 2018, 8:47 PM IST
Highlights

టిడిపికి క్షుద్ర పూజలవసరం లేదు, ప్రజల మద్దతు ఉంది.

ప్రతిపక్ష వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చేసిన ఒక విమర్శ మీద తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. నిన్న రాత్రి విజయవాడ దుర్గ గుడిలోక్షుద్రపూజలు జరిగినట్లు ఒక వార్త సంచలనం, వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.  అయితే ఈక్షుద్ర పూజలను లోకేష్ ని సీఎం చేయటం కోసం చేశారని వైసిపి నేత అనడానికి తెలుగుదేశం ప్రభుత్వ చీఫ్ విప్ బుద్ధా వెంకన్న అభ్యంతరం తెలిపారు.

రాజకీయాల కోసం దేవాలయాలను, దేవుళ్లను  లాగుతున్నారని ఆయన విమర్శించారు.లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయాలా లేదా అనేదాన్ని  ప్రజలే నిర్ణయిస్తారని  క్షుద్రపూజలు  చెయ్యాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇలాంటి విమర్శులు చేయవద్దని, ఏడు కొండలను రెండు కొండలే అన్న వారు ఏమైనారో తెలుసుకోవాలని వెంకన్న అన్నారు. జగన్ పాదయాత్రలో జనాలు కరువైనందున  ప్రజల దృష్టి మరలించేందుకు  లోకేష్ బాబు మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘దేవుడిని మనం భక్తితో కొలుస్తాం. కానీ రాజకీయాల కోసం మతాలు మార్చే వాడు జగన్. కొత్త సంవత్సరంలో అయినా వైసీపీ చవకబారు రాజకీయాలు మానుకోవాలి. మా కన్నా ముందే మీకు లోకేష్ ని సీఎం చెయ్యాలనే కోరిక ఉన్నట్టు ఉంది,’ అని ఆయన అన్నారు.

 



 

click me!