ఈ విమానం 2018లో ఎగిరి.. 2017లో కిందకి దిగింది

First Published Jan 2, 2018, 5:13 PM IST
Highlights
  • విమానం వెనక్కి ప్రయాణించిందా?
  • న్యూ ఇయర్ నుంచి పాత సంవత్సరానికి ప్రయాణం

‘ఆదిత్య-369’ సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో హీరో, హీరోయిన్లు.. టైం మిషన్ ఎక్కి.. వెనకటి కాలానికి వెళ్లిపోతారు. ఇలాంటి ఘటనే ఒకటి నిజంగా జరిగింది. నమ్మసక్యంగా లేదా.. కానీ నిజంగా ఇదే జరిగింది. ప్రస్తుతం నెట్టింట ఈ విమానం గురించే అందరూ చర్చించుకుంటున్నారు.

విషయం ఏమిటంటే..  హవాయి ఎయిర్ లైన్స్ కి చెందిన హెచ్ఏ446 విమానం న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుంచి జనవరి 1వ తేదీ 2018న బయలుదేరింది. పది నిమిషాలు ఆలస్యంగా టేక్ ఆఫ్ తఅయిన ఈ విమానం.. 8గంటలు ప్రయాణించి 2017వ సంవత్సరానికి వెళ్లింది. చివరికు హోనోలోలు ప్రాంతంలో ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా.. నూతన సంవత్సరం నుంచి పాత  సంవత్సరంలోకి వెళ్లిపోయారు.

కాకపోతే ఇందులో చిన్న టెక్నిక్ ఉంది. ఆక్లాండ్ లో విమానం బయలు దేరే సమయంలో.. అక్కడ న్యూ ఇయర్ వచ్చేసింది. కానీ.. గమ్యస్థానానికి చేరుకునే సరికి అక్కడ ఇంకా న్యూ ఇయర్ రాలేదు. ప్రపంచంలోని అన్ని దేశాల టైమ్ జోన్లు ఒకేలా ఉండవన్న విషయం తెలిసిందే కదా. అందుకే వారు 8గంటలు ప్రయాణించినా.. మళ్లీ పాత సంవత్సరంలోకే వెళ్లారు. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.

 

click me!