గుడివాడ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Published : Apr 13, 2018, 01:48 PM IST
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

సారాంశం

టీడీపీ సీనియర్ నేత దుర్మరణం

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే రావి శోభానాదీశ్వర చౌదరి(95) శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గానికి 1984-89, 1994-99 కాలంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గుడివాడ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా 25సంవత్సరాలు ఏకధాటిగా కొనసాగారు. జిల్లాలో తెదేపా బలోపేతానికి అహర్నిశలూ కృషి చేశారు. ఆయన కుమారుడైన రావి వెంకటేశ్వరరావు ప్రస్తుత తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా  కొనసాగుతున్నారు. పలువురు ప్రముఖులు శోభనాదీశ్వర చౌదరి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !