
హైకోర్టు న్యాయమూర్తికే జైలుశిక్ష విధించిన అరుధైన ఘటన దేశంలో చోటు చేసుకుంది. దేశచరిత్రలోనే మొదటిసారిగా హైకోర్టు న్యాయమూర్తికి సుప్రింకోర్టు శిక్ష విధించింది. కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్నన్ కు సుప్రింకోర్టు 6 మాసాల జైలు శిక్ష విధించటం ఒక విధంగా సంచలమే అవుతుంది.
జస్టిస్ కర్నన్ కు సుప్రింకోర్టుకు మధ్య వివిధ సాంకేతిక అంశాలపై వివాదాలున్న విషయం తెలిసిందే కదా? కర్నన్ వ్యాఖ్యలను ప్రచురించినా, ప్రసారం చేసినా కోర్టు ధిక్కారణగా పరిగణిస్తామని 7గురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేయటం గమనార్హం. అంతేకాకుండా కర్నన్ ను వెంటనే అరెస్టు చేయాలని కూడా పశ్చిమబెంగాల్ డిజిపిని సుప్రింకోర్టు ఆదేశించటం గమనార్హం.
కర్నన్ మానసిక పరిస్ధితిపై వైద్య పరీక్షలు నిర్వహించాలని గతంలో ఓ కేసుకు సంబంధించి సుప్రింకోర్టు ఆదేశించింది. అయితే, వైద్య పరీక్షకు అంగీకరించ లేదు. అంగీకరించకపోగా తనపై ఆదేశాలిచ్చిన సుప్రింకోర్టు ధర్మాసనంపైనే అనుచిత వ్యాఖ్యలు చేసారు. దాంతో కర్నన్ –ధర్మాసనం మధ్య ఒక విధంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. దాని పర్యవసానమే ఈ రోజు సుప్రింకోర్టు తీర్పు.