
ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్.. ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పై విమర్శలు గుప్పించారు.
బుధవారం ఉమా విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదని.. సీఎం కుర్చీకోసమేనన్నారు. ఇప్పటి వరకు తమ టీడీపీ ప్రభుత్వం 24వేల కోట్లు రుణమాఫీ చేసిందని.. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని చెప్పారు.
ఒకవైపు చంద్రబాబు ఏపీని నెంబర్ వన్‌గా తిర్చిదిద్దుతుంటే.. మరోవైపు జగన్ మాత్రం అవినీతిలో నెంబర్ వన్ చేస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. అలాగే జగన్ పాదయాత్ర కాదు, పొర్లు దండయాత్ర చేసిన ప్రజలు ఆయన్ను నమ్మరని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.