
ఒక్కరోజులో ఐవైఆర్ కృష్ణ రావు తెలుగుదేశం పార్టీకి ఎంతశత్రువయ్యాడంటే ఆయనను వికృతీకరించి కసి తీర్చుకుంటన్నారు పార్టీ వాళ్లు. మొన్నమొన్నటి దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాన సలహాదారుగా ఉన్నవ్యక్తిని రాజకీయ నాయకుడిగా మాదిరిచూస్తూ ఫోటోమార్ఫింగ్ చేసి అసహ్యంగా తయారుచేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అదొక విజయంగా చెప్పుకుంటున్నారు. ఇది సహించలేని బ్రాహ్మణ సంఘాలు ఈ రోజు ఇలాంటి పొస్టింగులు పెట్టిన వారిమీద చర్య లు తీసుకోవాలని విజయవాడలో డిజిపి సాంబశివరావుకు ఫిర్యాదుచేశాయి. అయితే సాయంకాలానికి పోస్టు మాయమయింది.
చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండి ఎన్నో అభ్యంతరకరమయిన విషయాలను చూసీ చూడనట్లు పోయిన ఐవైఆర్ ఇపుడు ఇవి వెల్లడిస్తాడేమోనననే భయం టిడిపి లో మొదలయినట్లుంది. అందుకే ఆయన పై ఫేస్ బుక్ దాడి మొదలయింది. ఇపుడు ఐవైఆర్ వెనక్కి వెళ్లకుండా అమరావతి గురించిని విషయాలన్నీ వెల్లడిస్తాడేమో చూడాలి.
బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నిన్నటి దాకా పనిచేసిన వ్యక్తిని ఇటువంటి పోస్టుల ద్వారా అవమానించడానికివారు బ్రాహ్మణులు అభ్యంతరం చెప్పారు. దీనికి బాధ్యులయిన వారిపై తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి బృందం డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఐజీ మీనాకు వినతిపత్రం సమర్పించింది.
అనంతరం వారు విలేకురుల ముందు తమ విచారం వ్కక్తం చేశారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని, కార్పోరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం, ఇప్పుడు అదే సోషల్ మీడియాలో కృష్ణారావుపై వచ్చిన పోస్టులను ఎలా సహిస్తున్నదని వారు ప్రశ్నించారు.
‘‘48 గంటల్లో ఈ అసభ్య పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతాం,’’ అని బ్రాహ్మణ సంఘాల నేతలు యేలేశ్వరపు జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ద్రోణంరాజు రవికుమార్, జింకా చక్రధర్ డిమాండ్ చేశారు.