నోట్ల మార్పిడి బంద్

First Published Nov 24, 2016, 2:51 PM IST
Highlights

కేంద్ర ప్రభత్వం మరో షాక్

బ్యాంకుల్లో డిపాజిట్ కు మాత్రమే అనుమతి

పాత నోట్లతో డిసెంబర్ 15 వరకు బకాయిల చెల్లింపు

రూ. 1000 నోట్ల మార్పడి పూర్తిగా రద్దు?

రూ. 500 నోట్ల పై స్వల్ప సడలింపు

పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఈ రోజు అర్ధరాత్రి  నుంచి బ్యాంకుల్లో పెద్ద నోట్ల మార్పిడిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.అయితే కేవలం తమ ఖాతాల్లో పెద్ద నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది.  

 

అలాగే, రూ. 1000 నోట్ల మార్పడి పూర్తిగా రద్దు చేస్తునట్లు, రూ. 500 నోటుపై కొంత వరకు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.మరోవైపు పెద్ద నోట్లతో డిసెంబర్ 15 వరకు బకాయిలు చెల్లించే అవకాశం కూడా కల్పించింది.


ఈ నెల 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే నోట్ల రద్దు తర్వాత బడాబాబులు నల్ల ధనం మార్చేందుకు అక్రమాలకు పాల్పడుతున్నట్లు   ఆరోపణలు వస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

click me!