ఈ మూగ వేదన ఇలా బయటపడింది

Published : Nov 24, 2016, 08:30 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఈ   మూగ వేదన ఇలా బయటపడింది

సారాంశం

లైంగిక వేధింపులు,ఫిర్యాదులు, కేసులు  చాలా పెద్ద సమస్య.  ముందు మా కొక టాయిలెట్ కట్టించండి : ఎస్పీకి  ఒక బాలిక  విజ్ఞప్తి

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రెమా రాజేశ్వరి  పోలీసులను ’జనజీవన  స్రవంతి‘ తీసుకువచ్చే పనులెక్కువ గా చేపడుతుంటారు.

 అమె ఎక్కడ పని చేసినా పోలీసులను ఏదో ఒక విధంగా ప్రజలకు సన్నిహితం చేసేందుకు  పోలీసేతర క్యాంపెయిన్ లోకి దింపేస్తారు. పుష్కారాలు కావచ్చు, బాల్య వి వాహాలు, బాలికల   లింగ వివక్ష కావచ్చు, ప్రతిపోలీసు అధికారి కొంత సేపయిన  ప్రజలతో వాళ్ల సమస్యల గురించి మాట్లాడేలా చేస్తారు. పోలీసులు సాంఘిక భద్రతా దళం కావాలన్నది ఆమె ఆశయం.

 అమె నిర్వహించే క్యాంపెయిన్ల నుంచి అనేక ఆసక్తి కరమయిన విషయాలు బయటపడుతుంటాయి. చాలా సందర్భాలలో అవి జాతీయ  వార్తలయ్యాయి. ఇపుడు చేపట్టిన క్యాంపెయినలో ఒక బాధాకరమయిన విషయం బయటపడింది: 2500 మంది యుక్తవయసు బాలికలకు ఒకే ఒక్క మురికి  కూపం వంటి మరుగుదొడ్డి.

 

గత వారం రోజులుగా మహబూబ్ నగర్ జిల్లాలో బాలికల మీద లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ‘క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. బాలికల మీద అత్యాచారాలలో ఈ జిల్లా అగ్రస్థానంలోఉంది.

 

పోలీసు అధికారులు, ప్రచార సామగ్రి తో ప్రతి హైస్కూల్, జూనియర్ కాలేజీలకు వెళ్లి లైంగిక వేధింపులు గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి వేధింపులు ఎదురయినపుడు కుంగిపోయి,చదువొదిలేసే ఇంటికివెళ్లిపోవడం, లేదా, లోలోపలే కుమిలిపోతూ వేధింపులను భరించడం జరుగుతుంది. అలాకాకుండా  ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేలా ధైర్యం కల్గించడం ఈ కాంపెయిన్ ఉద్దేశం.

 

ఇపుడీ కార్యక్రమంలో జిల్లా పోలీసులు నిండా మునిగి ఉన్నారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా రెమా రాజేశ్వరి నవంబర్ 21న మహబూబ్ నగర్  పట్టణంలోని బాలికల జూనియర్ కాలేజీకి వెళ్లారు. అందరిని కూర్చో బెట్టి బాగోగులు మాట్లాడుతున్నపుడు ఒక బాలిక  ఈ సంభాషణ కట్టిపెట్టండంటూ లేచి నిలబడింది.

 

 ఆ అమ్మాయి ప్రశ్న, దుందుడుకు తనం  రెమాకు  ఆశ్యర్యం తెప్పించింది. ఆ అమ్మాయేదో సీరియస్  ఫిర్యాదు చేయబోతుందనుకుని  చెప్పేందుకు అవకాశం ఇచ్చారు. విషయమేదయిన  దాచుకోకుండా చెప్పమని ప్రోత్సహించారు.

 

 లైంగిక వేధింపులు, ఫిర్యాదులు చాలా పెద్ద విషయాలు. మాకొ చిన్న సమస్య ఉంది. దాని గురించి వినండి.. అంటూ ఆ జూనియర్ కాలేజీలలో తాము పడుతున్న మూగ వేదన గురించి నాగరికులెక్కడ ఉన్నా సిగ్గు పడేలా చెపింది.

 

ఎదురుగా ఉన్నది మహిళా ఎస్ పి కాబట్టి ఇంకా ధైర్యంగా చెప్పింది.

’పెద్ద పెద్ద విషయాలు కాదు, మాకో చిన్న సమస్య ఉంది. ఈ కాలేజీలో టాయిలెట్ లేదు. ఉండేది అక్షరాల మురికి కూపం. 2500 మంది విద్యార్థులకు అందుబాటులో ఉండేదొకటే మరుగుదొడ్డి. మీ పలుకుబడి ఉపయోగించి ఒకటి కట్టించండి, ‘ అని చెప్పింది.

ఆ అమ్మాయి  అమాయకంగానే నిలదీసింది. తన క్యాంపెయిన్ ఉద్దేశం కూడ ఇదే. ప్రతి అమ్మాయి తనకు ఎదురయ్యే ప్రతి సమస్య మీద ఇలా బాలికలంతా ఇలా నిలదీసేలా చేయడమే. అమ్మాయిని అభినందించి, టాయిలెట్ ను స్వయంగా పరిశీలించి వచ్చారు.

ఈ సమస్య గురించి తాను కలెక్టర్ , ఇతర అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇపుడామె ఈ పనిలో నిమగ్నమయి ఉన్నారు.

 రెమా గురువారం నాడు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కాలేజీని ఈ రోజే సందర్శించి సమస్యను పరిష్కరిస్తానని హామీ  ఇచ్చారు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !