రజనీ తమిళుడు కాదు ఇంగ్లిష్ రాదు: స్వామి

Published : May 19, 2017, 05:03 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
రజనీ తమిళుడు కాదు  ఇంగ్లిష్ రాదు: స్వామి

సారాంశం

తళైవా ని టార్గట్ చేస్తున్న బీజేపీ  

తమిళనాట మొన్నటి వరకు రజనీ జపం చేసిన బీజేపీ ఇప్పుడు రూటు మార్చింది. తళైవా రాజకీయ పార్టీ పెడుతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో రజనీ లక్ష్యంగా ఇప్పుడు బీజేపీ మాటలతూటాలు పేల్చుతోంది.

 

బీజేపీ నేత, వివాదాస్పద నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అప్పుడే రజనీ పై విమర్శల దాడి మొదలుపెట్టారు.

 

రజనీ పాలిటిక్స్ కు, ముఖ్యమంత్రి పదవికి పనికి రాడని అన్నారు. ఆయనకు ఇంగ్లీష్ రాదు. అసలు తమిళుడే కాదు అని విమర్శించారు. సరస్వతీ పుత్రులైన తమిళ ప్రజలు అంతగా చదువుకోని  రజనీ సీఎం అయితే చూసితట్టుకోలేరంటూ మండిపడ్డారు. ఒకవేళ పార్టీ అధిష్టానం రజనీతో పొత్తుపెట్టుకుంటే వ్యతిరేకిస్తానన్నారు.

 

అయితే స్వామి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక బీజేపీనే ఆయనతో ఈ మాటలనిపిస్తోందా అనేది తెలియడం లేదు. అయితే స్వామి వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటి వరకు స్పందించలేదు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !