కాబూల్ లో ఆత్మాహుతి దాడి: 31 మంది దుర్మరణం

First Published Apr 22, 2018, 3:38 PM IST
Highlights

కాబూల్ లో ఆత్మాహుతి దాడి: 31 మంది దుర్మరణం

కాబూల్: కాబూల్ లోని వోటర్ రిజిస్ట్రేషన్ కేంద్రంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 31 మంది మరణించగా,త 54 మంది గాయపడ్డారు. 

ఆదివారం జరిగిన ఈ దాడిలో 15 మంది మరణించినట్లు ప్రజా ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాహిద్ మజ్రో తొలుత చెప్పారు. ఈ దాడి తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించినట్లు ఆ గ్రూప్ నకు చెందిన అమక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 

ఈ ఏడాది జరిగే పార్లమెంటరీ ఎన్నికల కోసం ఓటర్లను నమోదు చేసుకునే ప్రక్రియలో భాగంగా ఐడెంటిటీ కార్డులు జారీ చేస్తుండగా బాంబర్ కాలినడకన వచ్చి దాడి చేసినట్లు ఇంటీరియల్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నజీబ్ డానేష్ చెప్పారు.

సోషల్ మీడియా సైట్లలో నాలుగు శవాలను, ధ్వంసమైన కార్లను ఫోటోలు తీసి షేర్ చేశారు. అక్టోబర్ జరగాల్సిన పార్లమెంటరీ, జిల్లా కౌన్సిల్ ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ స్థితిలో ఓటర్ల నమోదుకు అఫ్గనిస్తాన్ అంతటా ఓటర్ల నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
click me!