ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై

Published : Oct 14, 2017, 05:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:42 PM IST
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై

సారాంశం

కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై ప్రయోగాత్మకంగా 200 బస్సుల్లో అమలు వచ్చే మార్చి నాటికీ అన్ని బస్సుల్లో ఉచిత వైఫై

కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తున్నది.  ప్రయాణికులను ఆకట్టుకునేందుకు
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 200 ఆర్టీసీ బస్సుల్లో అమలు చేయగా.. రానున్న మార్చి నెల నాటికి అన్ని ఆర్టీసీ బస్సుల్లో అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర  రవాణా శాఖ మంత్రి రేవన్న  అధికారికంగా తెలియజేశారు.
 

ఉచిత వైఫై కి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని మంత్రి రేవన్న చెప్పారు. ప్రయోగాత్మకంగా 200 బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేశామని.. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమలు చేస్తామన్నారు. ఈ కాంట్రాక్టును కేపీఐటీ అనే సంస్థకు అప్పగించామని ఆయన వివరించారు. వచ్చే మార్చి నాటికి అన్ని కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై అందిస్తామని మంత్రి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !