తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య

First Published Apr 14, 2018, 5:15 PM IST
Highlights
ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎఫెక్ట్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఈ ఫలితాలకు భయపడి రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు ఫలితాలకు భయపడి వెలువడక ముందే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలా రాజధాని హైదరాబాద్ లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా ఇతర ప్రాంతాల్లో మరో ఇద్దరు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

నిన్న వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ అయ్యానన్న మనస్థాపంతో గాజుల రామారామారానికి చెందిన శ్రీవిద్య(18) బలవన్మరణానికి పాల్పడింది. చింతల్ లోని గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ పస్టీయర్ ఎంపిసి చదువున్న ఈ యువతి పరీక్షలో ఫెయిల్ అయ్యింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై తాము నివాసముంటున్న అపార్టుమెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఇలాగే హైదరాబాద్ మేడిపల్లి ఫిర్జాధిగూడ ప్రాంతానికి చెందిన దూల వర్ష(16) కూడా వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య కు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ప్యాన్ కి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

మరో సంఘటనలో కూకట్‌పల్లి సమీపంలోని కైతల్లాపూర్‌కు చెందిన కాట్రాజ్ కిరణ్ (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం తప్పడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాచిగూడలోని సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజీలో నీరవ్ మార్షు(18) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు ఎక్కడ ఫెయిల్ అవుతానేమో అన్న అనుమానంతో రిజల్స్ కు ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. వీరు నివాసముండే అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే.. నీరవ్ పాస్ అయి ఉండటం గమనార్హం.  

 వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన సూదిరెడ్డి అనే స్టూడెంట్ ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించారు.
 
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో ఇంటర్ విద్యార్థిని వంగెటి జాహ్నవి (17) ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్ష ఫలితాలు వెల్లడికి ముందే ఫెయల్ అవుతానేమోననే భయంతో జాహ్నవి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫలితాల వెల్లడి తరువాత ఒక సబ్జెక్టులో ఆమె ఫెయల్ అయనట్లు తేలింది.  
 
 

click me!