ఫెయిల్ అవుతానేమోనన్న అనుమానంతో విద్యార్థి ఆత్మహత్య

First Published Apr 14, 2018, 4:35 PM IST
Highlights
తీరా అతడి రిజల్ట్ చూస్తే...

ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. వెలువడిన ఫలితాల్లో ఎక్కడ తాను ఫెయిల్ అవుతానేమోనన్న అనుమానంతో రిజల్ట్ చూసుకోకుండానే ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానీ తీరా రిజల్ట్స్ చూస్తే అతగడు పాసయ్యాడు. క్షణికావేశంతో తీసుకున్న విద్యార్థి నిర్ణయం తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని కల్గించింది.

ఈ ఘటన హైదరాబాద్ లోని కాచిగూడలో చోటుచేసుకుంది. స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజీలో నీరవ్ మార్షు(18) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు ఇటీవల జరిగిన పరీక్షలను సరిగా రాయలేదు. దీంతో ఎక్కడ ఫెయిల్ అవుతానేమో అన్న అనుమానంతో ఉన్నాడు. దీంతో నిన్న పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయని తెలిసి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో ఫలితాలు వెలువడడానికి ముందే తాము నివాసముండే అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే.. నీరవ్ పాస్ అయి ఉండటం గమనార్హం. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం నీరవ్ జీవితాన్ని బలితీసుకోవడమే కాకుండగా అతడి తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చింది.
 

click me!