
రన్ వే నుంచి గాలిలో రయ్య్ మంటూ ఎగరాల్సిన విమానం నిప్పులు చిమ్ముతూ నేలను తాకింది.
అదృష్టవశాత్తు ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేరు. లేకుంటే భారీగా ప్రాణనష్టం జరిగేది.
వాషింగ్టన్‌లోని ముకిల్టియోలో ఈ ఘటన చోటు చేసుకుంది.
విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలెట్ కాస్త ఆలోచించి నిర్మానుష్య ప్రదేశంలో ల్యాండ్ చేయాలనుకున్నాడు.
అయితే విమానం ఆయన అదుపులో లేకుండా పోయింది. మరింతగా నేలవైపునకు దిగిరావడంతో చేతులెత్తేశాడు.
రోడ్లకు రెండు వైపుల ఉన్న కరెంటీ తీగలు విమానాన్ని తాకడంతో అది కాస్త షార్ట్ సర్క్యూట్ కు గురైంది. వెంటనే దట్టంగా మంటలు వ్యాపించాయి.
అయితే ఆ టైంలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో స్వల్పంగా కొన్ని కార్లు మాత్రమే దెబ్బ తిన్నాయి. ప్రాణనష్టం ఏమీ జరగలేదు. చాకచక్యంగా వ్యహరించిచ పైలెట్ విమానం నుంచి ముందే దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.