థియేటర్లోనే కాదు పెళ్లిలోనూ ‘జనగణమన’...

First Published May 3, 2017, 12:13 PM IST
Highlights

పెళ్లి మండపంలో మంగళసూత్రం కట్టగానే శ్రీనివాస్ రాజే  అక్కడున్నవారినందరిని నిల్చోమని కోరాడు.

సినిమా థియేటర్లలో జనగనమణ కచ్చితంగా పాడిల్సిందే, అందరూ గౌరవించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో అందరూ దాన్ని ఫాలో అయిపోతున్నారు.

 

కర్నాటకలోని చిక్ మంగళూరు కు చెందిన ఈ వరుడు మాత్రం దేశ భక్తి మరీ ఎక్కువగా ఉన్న వ్యక్తి . అందుకే థియేటర్ లోనే కాదు తన పెళ్లి మండపంలో కూడా జనగణమన పాడాల్సిందేనని నిశ్చయించుకున్నాడు.

 

బీఎస్ శ్రీనివాస్ రాజే సౌత్ ఆఫ్రికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆయనకు కర్నాటకకే చెందిన సరితతో వివాహం నిశ్చయమైంది.

 

పెళ్లి మండపంలో మంగళసూత్రం కట్టగానే శ్రీనివాస్ రాజే  అక్కడున్నవారినందరిని నిల్చోమని కోరాడు.

 

అలాగే, అక్కడే ఉన్న అర్కెస్ట్రాను పిలిచి జనగణమన గీతం వాయించాలని కోరాడు.

 

దీంతో అందరూ జాతీయగీతాన్ని గౌరవిస్తూ పెళ్లిమండపంలో జనగణమన కు కోరస్ పాడారు. ఆ తర్వాత పెళ్లి కొడుకు దేశభక్తి కి మెచ్చుకున్నారు.

click me!