అయోధ్య రామయ్యకు షియా ముస్లింల వెండి బాణాల కానుక

First Published Oct 17, 2017, 6:09 PM IST
Highlights
  • సరయు నది ఒడ్డున రాముని విగ్రహాన్ని నిర్మించనున్న యూపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన షియా ముస్లింలు
  • రాముడికి వెండి బాణాలు అందజేస్తామని ప్రకటించిన షియా ముస్లింలు

అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని.. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆ కల.. బీజేపీ ప్రభుత్వ హయాంలో నేరవేరుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం అయోధ్య రామయ్య కు 10 వెండి బాణాలు కానుకగా అందనున్నాయి. ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వఖ్ బోర్డ్ .. ఈ వెండి బాణాలను అందజేయనుంది. రాముడిపై తమకు ఉన్న భక్తిని చాటుకునేందుకు వీటిని అందజేసినట్లు బోర్డు సభ్యులు తెలిపారు.

అయోధ్యలో రాముడి విగ్రహాన్ని నిలబెట్టడానే యూపీ ప్రభుత్వ నిర్ణయాన్ని  షియా వఖ్ బోర్డు స్వాగతించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో  బోర్డు ఛైర్మన్ వసీమ్ రజ్వీ మాట్లాడుతూ రాముడి విగ్రహాన్ని నెలబెట్టాలనే యూపీ ప్రభుత్వ నిర్ణయం మెచ్చుకోదగినదని, గంగ-జమున్ సంగమం కోసం.. తమకు రాముడిపై ఉన్న గౌరవాన్ని తెలపడానికి ఈ వెండి బాణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈమేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి ఆయన లేఖ కూడా రాశారు. అయోధ్యలో రాముని విగ్రహాన్ని నెలకొల్పితే ప్రపంచ పటంలో యూపీకి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుదంని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అయోధ్యలోని ఆలయాలకు నవాబులు ఎప్పూ గౌరవించారని చెప్పారు. అయోధ్యంలోని హనుమాన్ ఆలయానికి భూములను 1739లో నవాబు షుజా-ఉద్- దౌలా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆలయ నిర్మాణానికి నిధులు 1775-1793 మధ్య కాలంలో ఆసిఫ్- ఉద్ - దౌలా అనే మరో నవాబు  ఇచ్చారని తెలిపారు.

ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సరయూ నది ఒడ్డున  100 అడుగుల రాముని విగ్రహాన్ని నిలబెట్టాలనుకుంటున్న సంగతి తెలిసిందే.  ఆ భూమి సున్నీ వఖ్ బోర్డుది కాదని.. తమదేనని షియా బోర్డు చెబుతోంది. దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉంది.

click me!