నా రంగు గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు

Published : Jul 27, 2017, 01:40 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
నా రంగు గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు

సారాంశం

జాతి వివక్షతను ఎదుర్కొన్నాను నా  ఒంటి రంగుపై కామెంట్లు చేసేవారు

అమెరికాని పాలించిన మొదటి, ఏకైక నల్లజాతీయుడు  ఒబామా. ఆయన భార్య మిషెల్ ఒబామా జాతి వివక్షను ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. వివరాల్లోకి వెళితే.. 2016 అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారిగా మిషెల్‌   కొలొరోడోలోని విమెన్స్‌ ఫౌండేషన్‌లో 8 వేల  మంది మహిళల ముందు ప్రసంగం ఇచ్చారు. 
ఈ సందర్భంగా మిషెల్‌ మాట్లాడుతూ.. ప్రథమ మహిళగా ఎనిమిదేళ్లు తాను చేసిన సేవ, అందుకొన్న విజయాల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు కానీ ఇప్పటికీ తన చర్మ రంగు గురించి తక్కువ చేసి చూస్తున్నవారు చాలా మందే ఉన్నారని ఆమె తెలిపారు. ప్రథమ మహిళగా ఉన్నప్పటికీ తాను జాతి వివక్షతను ఎదుర్కొన్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఫిట్ నెస్ కోసం షార్ట్స్ వేసుకోని పుష్ అప్స్ చేయడం కూడా తప్పుగా భావించారని ఆమె పేర్కొన్నారు.
. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయంలో వెస్ట్‌ వర్జీనియాకి చెందిన ఎన్జీవో యజమాని మిషెల్‌ని హీల్స్‌ వేసుకున్న చింపాంజీ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !