నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

Published : Jul 27, 2017, 01:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

సారాంశం

కేంద్ర ఎన్నికల కమిషన్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల  చేసింది.

కేంద్ర ఎన్నికల కమిషన్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల  చేసింది.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూలై 29 న విడుదల అవుతుంది.

నామినేషన్ వేసేందుకు ఆగస్టు 5 చివరి తేదీ. ఆగస్టు 9 నామినేషన్ల ఉప సంహరణకు గడువు.

పోలింగ్   ఆగస్టు 23న జరుగుతుంది.

ఓట్ల లెక్కింపు ఆగస్టు 28 న ఉంటుంది.

షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ మరుక్షణం నుంచి అమలులోకి వచ్చింది.

నంద్యాలలో శాసన సభ్యులు భూమా నాగిరెడ్డి మృతితో ఎర్పడిన  ఈ స్థానం ఖాళీ అయింది.

2014 ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి భూమా నాగిరెడ్డి టిడిపి అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి మీద గెలుపొందారు. గత ఏడాది ఫిబ్రవరిలో

భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు. ఈ ఏడాది  మార్చి 12న ఆయన గుండెపోటుతో మరణించారు.

ఇపుడు శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.

భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి టిడిపి అభ్యర్థిగా నిలబడ్డారు.

రకరకాల కారణాలతో ఈ ఎన్నిక తెలుగుదేశం ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన మీద రెఫరెండం అన్నట్లుగా సాగుతూ ఉంది.

అందుకే చాలా రోజులుగా షెడ్యూల్ కోసం రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

ఇపుడు షెడ్యూల్ విడుదలయింది.

 

 

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu