మరోసారి బ్యాంకుల సమ్మె

First Published 24, May 2018, 11:04 AM IST
Highlights

మళ్లీ కరెన్సీ కష్టాలు తప్పవా..?

మరోసారి బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టాలని భావిస్తున్నారు. ఈనెల 30, 31తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు 48 గంటలపాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నాయని 
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ విజయవాడ యూనిట్ నేతలు తెలిపారు. ఈమేరకు గురువారం విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నేతలు  మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలు ఉద్యోగులపై విభజించు.. పాలించు అనే పద్ధతిలో కొనసాగుతున్నాయన్నారు. 

తమ న్యాయమైన సమస్యలపై ఉద్యోగులను విభజించి చేస్తున్న పే సెటిల్మెంట్ కు మేము వ్యతిరేకం అని, కమిటీ నివేదికలు ఉద్యోగులకు వేజ్ రివిజన్ 2శాతం మాత్రమే చేశారని, 15శాతం పే రివిజన్ చేయాల్సి ఉన్నా బ్యాంకర్ల పరిస్థితి బాగోలేదని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి వాళ్లు ఎగ్గొట్టిన రుణాలను మినహాయించగా బ్యాంక్‌కు వచ్చిన లాభాల్లో 2శాతం పెంచుతామనడం సిగ్గు చేటని, ఒక్క నీరవ్ మోడీ వలన 11 వేల కోట్ల ఫైగా ఆ బ్యాంక్ నష్టపోయిందని తెలిపారు.  

ఇదిలా ఉండగా.. రెండు రోజుల పాటు బ్యాంకులు సమ్మె చేస్తే.. మరోసారి కరెన్సీ కష్టాలు అనుభవించాల్సి వస్తుందా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Last Updated 24, May 2018, 11:04 AM IST