24 మే 2018 గురువారం మీ రాశిఫలాలు

Published : May 24, 2018, 09:52 AM IST
24 మే 2018 గురువారం మీ రాశిఫలాలు

సారాంశం

రోజంతా ఆనందంగా ఉంటారు.

మేషం

మేషం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు.

వృషభం

వృషభం : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సం బంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహ న కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తా యి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. రోజంతా ఆనందంగా ఉంటారు.

మిథునం

మిథునం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బం ధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయి దా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

సింహం

సింహం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయి లు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం ఉంటుంది.

కన్య

కన్య : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్‌లో ఇబ్బంది పడే అవకాశముంటుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.

తుల

తుల: మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో మునిగి తేలుతారు. వ్యాపార విషయంలో పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు.

వృశ్చికం

వృశ్చికం : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి. ఆధ్యాత్మిక క్షేతాల్ని సందర్శిస్తారు. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. 

ధనుస్సు

ధనుస్సు : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

మకరం

మకరం: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఎక్కువ విశ్రాంతి తీసుకోండి. జ్వరం లేదా వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలుంటాయి. గొప్పలకు, పోటీలకు పొయి డబ్బు ఖర్చు చే యకండి. దాని వలన డబ్బు ఖర్చవటమే కాకుండా అవమానాల ను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కుంభం

కుంభం : మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం.

మీనం

మీనం : ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాల కు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులు కలుస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ శత్రువులపై ఒక కన్నేసి ఉంచండి

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu