మరుగుదొడ్డి కట్టించుకోలేకపోతే.. భార్యను అమ్ముకోండి

Published : Jul 24, 2017, 12:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
మరుగుదొడ్డి కట్టించుకోలేకపోతే.. భార్యను అమ్ముకోండి

సారాంశం

ఇంట్లో టాయ్ లెట్ కట్టించుకునే స్థోమత లేకపోతే మీ భార్యను అమ్ముకోండి కన్వాల్ తనుజ్ పేర్కోన్నారు

ఇంట్లో టాయ్ లెట్ కట్టించుకునే స్థోమత లేకపోతే మీరు మీ భార్యలను అమ్ముకోండి అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు సూచించారు.

ఈ సంఘటన  బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఔరంగాబాద్ లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.  
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నతాధికారి కన్వాల్ తనుజ్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండటం మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినదిగా చెప్పారు.

మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12000 ఖర్చు అవుతుందని.. ఎవరి భార్య విలువ రూ.12000 కన్నా తక్కువ అని ప్రశ్నించారు.

కార్యక్రమానికి హాజరైన గ్రామస్థులలో ఒకరు తన వద్ద అంత డబ్బు లేదంటూ చెప్పగా... అయితే నీ భార్యను అమ్ముకో..

నీ ఇంటి ఆత్మ గౌరవాన్ని వేలానికి పెట్టు అంటూ ఆ అధికారి పేర్కొన్నారు.
కాగా.. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి అయ్యి  ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ప్రతిపక్షాలు  ఆరోపిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !