
తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న పనులకు అడ్డంకి ఇంకా తొలగినట్టులేదు. రాష్ట్ర సచివాలయ నిర్మాణమే అందుకు నిదర్శనం. తెలంగాణ సెక్రటేరియట్ ఏర్పాటుకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు అడ్డొచ్చే ప్రమాదం కనిపిస్తూ ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి .. సచివాలయాన్ని ఇప్పుడు ఉన్న స్థలంలో కాకుండా మరో చోట నిర్మించాలని భావిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయానికి వాస్తు దోషం ఉందని.. బైసన్ పోలో గ్రౌండ్స్ లో సచివాలయాన్ని, జింఖానా గ్రౌండ్స్ లో అసెంబ్లీ నిర్మించాలని భావిస్తున్నారు. కాగా.. ఇప్పుడు సచివాలయ నిర్మిణానికి సుప్రీం కోర్టు ఉత్తర్వులు అడ్డంకి గా మారనున్నాయి.
బైసన్ పోలో గ్రౌండ్స్, జింఖానా గ్రౌండ్స్ లో ఇప్పటి వరకు ఆర్మీ అధికారులకు శిక్షణ ఇచ్చేవారు. అయితే.. వాటిని తమకు ఇవ్వాల్సిందిగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అందుకు బదులుగా.. వేరే ప్రాంతానికి వాటికి కేటాయిస్తామని కూడా తెలిపింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. రేపో.. మాపో.. సచివాలయం నిర్మాణం మొదలవుతుందని అనుకుంటున్నారు. కోర్టు ఉతర్వులను చూస్తే నిర్మాణం మొదలు కావడం అంత సులభం కాదేమో అనిపిస్తూ ఉంది.
సుప్రీం కోర్టు నియమాల ప్రకారం.. ప్లే గ్రౌండ్స్, పార్కులకు కేటాయించిన భూములను మరో అవసరాల కోసం మార్చకూడదు. 2002 , ఫిబ్రవరి 20వ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టు తీర్పు ఈ మేరకు ఒక జీవోని కూడా విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం.. పార్కులు, ప్లేగ్రౌండ్స్ లకు కేటాయించిన భూములను ఇతర అవసరాలకు ఉపయోగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అంతేకాకుండా అలాంటి స్థలాల్లో భవనాలు నిర్మిస్తే.. పర్యావరణ, ఆరోగ్య, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందిని న్యాయస్థానం తెలిపింది.
బైసన్ పోలో గ్రౌండ్స్ లో సచివాలయాన్ని, జింఖానా గ్రౌండ్స్ లో అసెంబ్లీ నిర్మించాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అందుకు ఆ స్థలాన్ని ఇవ్వడానికి కూడా ఒప్పుకుంది. కానీ డిఫెన్స్ ఎస్టేట్స్ కార్యాలయం నుంచి గానీ.. ఎస్ సీబీ నుంచి గానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి ఆర్డర్లు రాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో సచివాలయ నిర్మాణాం కష్టతరమే అనిపిస్తోంది. ఒకవేళ కేంద్రం నుంచి ఆర్డర్లు జారీ అయితే.. నిర్మాణం సుగమం అవుతుంది.