ఐదేళ్ల బాలుడిపై క్రూరత్వం ప్రదర్శించిన స్కూల్ టీచర్

Published : Nov 16, 2017, 07:40 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఐదేళ్ల బాలుడిపై క్రూరత్వం ప్రదర్శించిన స్కూల్ టీచర్

సారాంశం

చిన్నారి బాలుడిని చితకబాదిన స్కూల్ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ముక్కుపచ్చలారని చిన్నారి 5 ఏళ్ల బాబుపై ఓ టీచర్ క్రూరంగా ప్రవర్తించింది. శరీరంపై వాతలు వచ్చేలా చితకబాది అత్యంత కఠినంగా వ్యవహరించింది. ఈ ఘటన హైదరాబాద్ తార్నాకలో ని సీక్రెట్ హార్ట్ స్కూల్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే తార్నాకలోని సీక్రెట్ హైస్కూల్ లో ఎండీ కాజా అనే 5 ఏళ్ల బాలుడు యూకేజీ చదువుతున్నాడు. అయితే ఈ బాలుడు ఎక్కువగా అల్లరి చేస్తున్నాడని స్కూల్  టీచర్ అతడిని చితకబాదింది. అత్యంత పాశవికంగా రక్తం వచ్చేలా బాది సాయంత్రం వరకు అలాగే ఎలాంటి ప్రథమ చికిత్స లేకుండా ఉంచింది. సాయంత్రం పిల్లాడిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు యూనిఫాం పై వున్న రక్తుపు మరకలు గమనించారు. ఏమైందా అని షర్ట్ విప్పి చూడగా నల్లగా కమిలిపోయిన దెబ్బలు కనిపించాయి.  
దీంతో తల్లిదండ్రులు నేరుగా ఓయూ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పిల్లాడిని గాయపర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. వారి పిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరిపి బాలుడిని పాశవికంగా కొట్టిన ఆ టీచర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !