
సర్వీస్ చార్జీ పేరుతో కస్టమర్లను బాదే ఆలోచనకు అన్ని బ్యాంకులకంటే ముందే శ్రీకారం చుట్టిన ఎస్ బీఐ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకొనే అవకాశం కనిపిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
కొత్త నిబంధనలపై అప్పుడే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సర్వీసు చార్జీలపై పునర్ ఆలోచించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారట. ముఖ్యంగా
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఎస్ బీఐని పునర్ ఆలోచించుకోవాలని కోరిన నేపథ్యంలో కొత్త నిబంధనలపై వెనక్కి తగ్గే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలన్స్ లేని ఖాతాలపై ఫైన్ వేయాలని ఎస్‌బీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఇంకా అనేక కొత్త నిబంధనలను తీసుకరావడానికి ఎస్ బీఐ నిర్ణయించింది.
ప్రవేటు బ్యాంకులు కూడా అదే స్థాయిలో సర్వీసు చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవతున్నాయి.