‘పటాస్’ కార్యక్రమంపై ఫిర్యాదు

First Published Mar 6, 2017, 11:33 AM IST
Highlights

ఈ నెల 4వ తేదీన ప్రసారమైన పటాస్‌షోలో నర్సులను కించపరిచేలా అసభ్యంగా మాట్లాడారని తెలంగాణ నర్స్ అసోయేషన్ సభ్యులు పేర్కొన్నారు.

అసభ్య పదజాలంతో ద్వంద్వార్థాలతో చవకబారు కామెడీలు చేస్తున్న టీవీ ప్రొగ్రాంలపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే అలాంటి వాటికే టీఆర్పీ రేటింగ్ లు ఎక్కువగా ఉండటంతో టీవీ యాజమాన్యాలు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.

 

కాగా, ఇటీవల ఇలాంటి ప్రొగ్రాంలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోర్టులకెక్కుతున్నారు, పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు.

 

ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్‌లో ప్రసారమైయ్యే పటాస్ కార్యక్రమంలో తమను తీవ్రంగా అవమానించారంటూ నర్సులు ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

ఈ నెల 4వ తేదీన ప్రసారమైన పటాస్‌షోలో నర్సులను కించపరిచేలా అసభ్యంగా మాట్లాడారని తెలంగాణ నర్స్ అసోయేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

గతంలో ఇదే టీవీ చానెల్ లో జబర్దస్థ్‌ కార్యక్రమంలో తమను కించపరిచారంటూ న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

 

కాగా, ఈ ప్రొగ్రాంపై విమర్శలు ఎక్కువవడంతో నిర్వహకులు యూట్యూబ్ లో ఉంచిన మార్చి 4 నాటి షో ను తొలగిండచం గమనార్హం.

 

 

click me!