చెన్నైకి పంపిస్తారనుకుంటే మరో 13 నెలలు వేశారు

Published : Feb 21, 2017, 12:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
చెన్నైకి పంపిస్తారనుకుంటే మరో 13 నెలలు వేశారు

సారాంశం

శశికళకు నాలుగేళ్ల శిక్ష విధించిన కోర్టు రూ. 10 కోట్లు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

చిన్నమ్మకు మరో పెద్ద కష్టం వచ్చేసింది. తమిళనాట అమ్మ మృతి తర్వాత సీఎం అవ్వాలనుకున్న శశికళ కల నెరవేరలేదు.

 

ఇది చాలదన్నట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో ఇప్పుడు  బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కపెడుతోంది.

 

అయితే దీనిపై ఆమె కోర్టులు పిటిషన్ వేసింది. తనకు కర్నాటకలో ప్రాణహాని ఉందని, చెన్నై  జైలుకు తనను తరలించాలని విన్నవించింది. కానీ, దీనిపై కోర్టు ఎటు తేల్చలేదు.

అయితే ఈ లోపే  శశికళకు సంబంధించిన మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.

 

శశికళకు నాలుగేళ్ల శిక్ష విధించిన కోర్టు రూ. 10 కోట్లు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

 

ఒక వేళ చిన్నమ్మ అంత మొత్తం చెల్లించకుంటే మరో 13 నెలలు జైళ్లో ఉండాలని కోర్టు తేల్చిచెప్పింది.

 

అంటే నాలుగేళ్లకు అదనంగా మరో 13 నెలలు ఆమె శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !