‘సీఎం’ గా శశికళ !

Published : Feb 15, 2017, 05:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
‘సీఎం’ గా శశికళ !

సారాంశం

నమ్మండి బాబు ఇది నిజంగా నిజం... కావాలంటే జైలు అధికారులను అడగండి.. అక్కడున్న ఖైదీలను అడగండి.. ట్విటర్ లో చూడండి.    

 

ఎట్టకేలకు చిన్నమ్మ శశికళ సీఎం అయ్యారు. కాకపోతే అది తమిళనాడులో కాదు.. ఆమె ఉంటున్న పరప్పర అగ్రహార జైళ్లో...

నమ్మండి బాబు ఇది నిజంగా నిజం... కావాలంటే జైలు అధికారులను అడగండి.. అక్కడున్న ఖైదీలను అడగండి..

 

ట్విటర్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ జైళ్లో సీఎంగా ఉండటం ఎంటీ అనుకుంటున్నారా... అసలే టన్నుల కొద్దీ క్రియేటివిటీ ఉన్న నెటిజన్లు సీఎం కు కూడా కొత్త అబ్రివేషన్ ను ఇచ్చారు.

 

శశికళ జైళ్లో శిక్ష అనుభవించే కాలంలో కాండిల్స్ తయారు చేయాల్సి ఉంటుందని అక్కడి జైలు అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో శశికళను కేండిల్ మేకర్ ( సీఎం) అని ట్విటర్ లో కొత్తగా పిలవడం మొదలుపెడుతున్నారు.

 

అంతటితో నెటిజన్లు  ఆగలేదు... చిన్నమ్న మీద సెటైర్ల మీద సెటర్లు వేస్తూనే ఉన్నారు. ట్విటర్ లో ఇప్పుడు ఇదే ట్రెండ్ గా కొనసాగుతోంది.


‘ చిన్నమ్న జైళ్లో ఒక్క ఫుడ్ ఐటమ్ తప్ప ఏదైనా తినడానికి సిద్ధమేనని స్పష్టం చేసిందట. ఇంతకీ ఆమె తినడానికి ఇష్టపడని ఆ ఫుడ్ ఏంటో తెలుసా... పన్నీర్.’

 

ఇలా సోషల్ మీడియాలో చిన్నమ్మ మీద జోకులు పేలుతూనే ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu