
"గవర్నర్ గారు నా దగ్గర 120మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి’’ - రిసార్టు యజమాని
అన్నా డీఎంకేలో చీలక అనంతరం శశికళ వర్గం చెన్నైలోని గెల్డెన్ బే రిసార్టులో సేదతీరుతున్న తరుణంలో నెట్ లో వైరల్ గా మారిన జోక్ ఇది. ఇప్పుడు ఈ జోక్ నిజమం కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
గత పది రోజుల నుంచి 120 మందికి పైగా అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు గోల్డెన్ బే రిసార్టు లోనే సేద తీరుతున్నారు. ఇంతకీ వారిని బంధించారా... వారే శశికళ కు మద్దతు తెలుపుతూ అక్కడ స్వచ్ఛంధంగా ఉన్నారా అనేది ఇప్పటికైతే తెలియదు.
ఎందుకంటే బయటి ప్రపంచంతో ఆ రిసార్టుకు ఎలాంటి సంబంధాలు ఉండవు.
చెన్నైలో అత్యంత రహస్య కేంద్రంగా ఆ రిసార్టుకు పేరుంది. ఫోన్, ఇంటర్నెట్, కనీసం టీవీ సిగ్నల్ కూడా అక్కడ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారట. అందుకే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు.
వారి మద్దతు ఎవరికి ఉందో కూడా స్పష్టత లేదు. అయితే కోర్టు శశికళకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వడంతో ఆమె తన స్థానంలో పళనీ స్వామిని సీఎంగా కూర్చొబెట్టాలని నిర్ణయించారు. అందుకే ఆయనను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
ఇంతకీ ఈ పళనిస్వామి ఎవరో తెలుసా... ఆ గోల్డెన్ బే రిసార్ట్స్ యజమానేనట. నెట్ లో ఈ వార్తే ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.