ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు

First Published Mar 7, 2017, 11:19 AM IST
Highlights

మావోయిస్టులతో సబంధాలున్నాయనే  ఆరోపణలు నిర్ధారణ కావడంతో ప్రొఫెసర్ సాయిబాబాకు గడ్చిరోలి కోర్టు  జీవితఖైదు విధించింది.

మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాకుమహారాష్ట్ర లోని గడ్చిరోలి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆయనతో పాటు మరో ఐదుగురికి కూడా శిక్షను ఖరారు చేసింది.

 

సాయిబాబాతో పాటు మహేష్‌ తిక్రి, పాండు నరోటీ, విజయ్‌ టిక్రి, జేఎన్‌యూ విద్యార్థులు హేమ్‌ మిశ్రా,  మాజీ జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ రాహితో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.

 

 మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం అవి నిర్థారణ కావడంతో శిక్షలు ఖరారు చేసింది.

 

గడ్చిరోలి పోలీసులు 2014లో సాయిబాబాను అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. దాదాపు ఏడాదికాలం ఆయన జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించారు. 

 

అయితే ఆయన వికలాంగుడు కావడం, అనారోగ్యంగా ఉండటంతో పాటు కుటుంబసభ్యులు విజ్ఝప్తి చేయడంతో  కోర్అటు అతడికి బెయిల్ మంజూరు చేసింది.

 

అయితే సాయిబాబాపై వచ్చిన ఆరోపణలపై గత కొంతకాలం నుంచి గడ్చిరోలి న్యాయస్థానం విచారణ జరుపుతూనే ఉంది. ఈ రోజు కోర్టు విచారణలో ప్రభుత్వం న్యాయవాది సాయిబాబాకు జీవిత ఖైదు విధించాలని, అనారోగ్య కారణాలతో అతడి శిక్ష తగ్గించరాదని కోరారు.

 

గతంలో అనారోగ్యంగా ఉన్నానంటూనే ఆయన దేశంతో పాటు విదేశాలలో పలు సదస్సుల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు.

 

కాగా, మావోయిస్టులతో సబంధాలున్నాయనే కారణంతో గతంలోనే డిల్లీ యూనివర్సిటీ సాయిబాబాను సస్పెండ్ చేసింది.

 

click me!