ఐదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ నేత అయిన రోశయ్య

First Published Nov 26, 2016, 9:40 AM IST
Highlights

చాలా రోజుల తర్వాత శనివారం నాడు  మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గాంధీ భవన్ కు వచ్చి మళ్లీ  కాంగ్రెస్ నాయకుడయ్యారు.

మాజీ సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి,  మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య మళ్లీ కాంగ్రెస్ నాయకుడయ్యారు.

 

 ఆయన ఈరోజు  గాంధీ భవన్ కు వచ్చిన మహిళా కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.   తమిళనాడు గవర్నర్  రిటైరయినంతర్వాత ఆయన ఇక పార్టీ కార్యక్రమాలలో కనిపించరేమో అనుకున్నారు. దీనికి భిన్నంగా ఆయన   శనివారం నాడు గాంధీ భవన్ కు వచ్చి, అచ్ఛం కాంగ్రెస్ నాయకుడిలాగా మాట్లాడారు. మహిళా కాంగ్రెస్ సభకు వచ్చిన రోశయ్య, తన రాక గురించి మాట్లాడుతూ సొంత ఇంటికి వచ్చినట్లుందని అన్నారు. ఈ సమావేశానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద అధ్యక్షత వహించింది.

 

2011 ముందు అరశతాబ్దం పాటు రాజకీయాలలో ఎపుడూ వినిపిస్తూ వచ్చిన గొంతు రోశయ్యది. మనిషి చాలా నిదానస్తుడయినా రోశయ్య నాలుక చాలా పదునయింది.రోశయ్య వ్యంగం వొళ్లు చీరేస్తుంది. అవతలి వ్యక్తిని నిలువునా దహించివేస్తుంది.  పదునైన వ్యంగ్యం ఆయన సొత్తు. అరుదుగా కోపగించుకున్నా, అందులో కూడా ఈ వ్యంగ్యం జోడిస్తాడు. అపారమయిన అనుభవం ఉన్ననాయకుడు కావడంతో ఆయన ఉపన్యాసలలో సొల్లు ఉండదు.  పాత తరం  మిగిలించిన చివరి నాయకుడాయన. బహుశా ఇక ముందుకు రాజకీయాల మీద కామెంట్స్ చేస్తూ ఉంటాడేమో చూడాలి.

 

 రాజకీయలలో తనకు సముచిత స్థానం ఇవ్వడమే కాదు దానినెపుడు డిస్టర్బ చేయని ఇందిరాగాంధీ గురించి  ఈ రోజు గాంధీ భవన్ లో  ఆయన నాలుగు ముక్కలు చెప్పారు. కాంగ్రె స్ ప్రాంతీయ కేంద్రమయిన గాంధీభవన్ కు వచ్చి మాట్లాడాలనుకోవడమే విశేషం. 

 

గాంధీ భావన్ కు రావడం.. స్వంతఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది, పార్టీ కార్యక్రమాలకు రావాలనే ఉంది. అయితే,  ఆరోగ్యం సంహరించడం లేదని చెప్పారు.  ఇందిరా గాంధీ నాయకత్వాన్ని కొనియాడుతూ,  అమె ప్రపంచానికే నాయకత్వం వహించిన మహా వనిత అని అన్నారు.

 

‘కుటుంబాన్ని కోల్పోయిన దేశానికి సేవచేసిన ధీర వనిత. ఇందిరా కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలకు  సాటిలేదు. పేదల అభ్యున్నతి కోసం పనిచేసిన ఇందిరమ్మను గుర్తుచేసుకోవడం సంతోషంగా ఉంది. దేశ సమైక్యతను కోరే ప్రతి ఒక్కరు ఇందిర సేవలను స్మరించుకోవాలి,’ అని ఆయన అన్నారు.

 

ఆ మధ్య ఆయన  కాపు రిజర్వేషన్ నాయకుడు  ముద్రగడ పద్మనాభాన్ని కూడా కలిసి వచ్చారు. తనకు పాత మిత్రుడు కాబట్టి కలసిశానని చెప్పినా, పోరాటం నిర్వహిస్తున్న నాయకుడిని కలుసుకోవడం కేవలం  మర్యాదపూర్వకం ఎలా అవుతుంది? ఇందులో కచ్చితంగా రాజకీయసందేశమేదో ఉండి ఉంటుంది.

 

మొత్తానికి చెప్పొచ్చేదేమోంటే, రోశయ్యకు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఆయన లో రాజకీయ నాయకుడు ఇంకా రిటైర్ కాలేదు. 2011 ఆగస్టు 26 న యుపిఎ హయాంలో ఆయన అప్పటి రాష్ట్రపతి ప్రతిభా భారతి తమిళనాడు  గవర్నర్ గా నియమించారు.

 

 

 

 

click me!