అసలుతో నకిలీ పోటీ

First Published Nov 26, 2016, 4:46 AM IST
Highlights

ఎస్ బి హెచ్ ప్రకారం రూ. 2 వేల కోట్ల విలువైన రూ. 2 వేల నకిలీ నోట్లు చెలామణిలో ఉన్నట్లు బహిరంగ ప్రకటన చేయటం గమనార్హం.

పెద్ద నోట్ల రద్దుపై నరేంద్రమోడి సర్కార్ లో అసలేమి జరుగుతోందో తెలీక ప్రజలు గందరగోళ పడుతున్నారు. ఇంకా నకిలీ వెయ్యి రూపాయల  నోట్లు  విస్తృతంగా చెలామణిలో ఉన్నట్లు బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నల్లధనం వెలికితీత, నకిలీ నోట్ల నియంత్రణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోడి చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను హటాత్తుగా రద్దు చేసారు. పెద్ద నోట్లను రద్దు చేయటంతో పొరుగునున్న పాకిస్ధాన్ నడ్డి విరిగిపోయినట్లు మోడి భక్త బృందం పెద్ద ఎత్తున మొదట్లో భజన చేసింది.

 

అయితే, రోజులు జరిగే కొద్దీ మోడి చెప్పినవన్నీ కథలేనని స్పష్టమవుతోంది.  ఎందుకంటే, దేశ ప్రజలు ఇంకా కొత్త రూ. 2 వేల నోట్లను పూర్తిగా చూడకముందే వాటికి నకిలీ నోట్లు చెలామణిలో వచ్చేసాయి. దానికిి తోడు రద్దైన వెయ్యి నోట్లు ఇంకా చెలామణిలో ఉండటంతో ఏది రద్దైన అసలు నోటో, ఏది నకిలీ నోటో అర్ధం కావటం లేదు. ఇటువంటి నకిలీన ోట్లు దేశవ్యాప్తంగా వేల కోట్లలో  చెలామణిలో ఉన్నట్లు బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

 

రద్దైన వెయ్యి నోట్లను బ్యాంకులు, పోస్టీఫీసుల్లో డిపాజిట్ చేసేందుకు కేంద్రం అనుమతించటమే  వెయ్యి  రూపాయల నకిలీ నోట్లు చెలామణి చేసే వారికి బాగా కలిసి వచ్చింది.  

 

నకిలీ నోట్లు చెలామణిలో ఉన్నాయని బ్యాంకులే స్వయంగా బహిరంగ నోటీసులు ఇస్తుండటంతో పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎస్ బి హెచ్ ప్రకారం రూ. 2 వేల కోట్ల విలువైన వెయ్యి రూపాయల నకిలీ నోట్లు చెలామణిలో ఉంది. 

 

 

click me!