బెజవాడ దుర్గమ్మ ఆదాయం పెరిగింది

First Published Jun 15, 2017, 8:40 AM IST
Highlights

ఇంద్రకీలాద్రి, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం హుండీల ఆదాయ లెక్కింపు మల్లికార్జున మహా మండపం ఒకటో అంతస్తులో బుధవారం నిర్వహించారు.

ఇంద్రకీలాద్రి, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం హుండీల ఆదాయ లెక్కింపు మల్లికార్జున మహా మండపం ఒకటో అంతస్తులో బుధవారం నిర్వహించారు. 15 రోజుల్లో 23 హుండీల్లో వేసిన కానుకలను లెక్కించగా రూ.1,53,24,618 ఆదాయం వచ్చింది. అందులో రూ.8,29,689 చిల్లర నాణాలను భక్తులు హుండీల్లో సమర్పించారు. 449 గ్రాముల బంగారం, 4.630 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో అమ్మవారికి చెల్లించుకున్నారు. ఆదాయం లెక్కింపులో అధిక శాతం సేవా సంస్థల నుంచి వచ్చిన సభ్యులు పాల్గొనడంతో ఎన్నెమ్మార్లకు లెక్కింపు నుంచి మినహాయించారు. ఏఈవోలు అచ్యుతరామయ్య, రామ్మోహనరావు, ప్రసాద్, సెక్యూరిటీ ఆఫీసర్ రాఘవయ్య పర్యవేక్షించారు.

click me!