
మొన్న నాగుల చవితి నాడు కాకినాడ సమీపంలో పుట్టలో పాలు పోస్తున్నపుడు నాగపాము పాకుతూ బయటకు వచ్చింది. పుట్టకోసం వచ్చినవారంత భక్తి పారవశ్యం చెందారు. నాగదేవుడు ఇలా ప్రత్యక్షం కావడం అరుదు. దాన్నొక శుభ సూచకంగా అంతా భావించారు. కొందరు దండాలు పెట్టారు. కొందరు వీడియో తీశారు. పుట్టలో పాలుపోసి, నూగుపిండి వేస్తున్నపుడు వూపిరాడక నాగుపాము బయటకొచ్చినట్లుంది.