రెండో స్థానంలో రేణిగుంట ఎయిర్ పోర్టు

First Published Nov 2, 2017, 2:09 PM IST
Highlights
  • రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయాం రెండో స్థానంలో నిలిచింది
  • దీపావళి పురస్కరించుకొని అలంకరణ పోటీలు నిర్వహించారు

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయాం రెండో స్థానంలో నిలిచింది. దీపావళి సందర్భంగా సుందరంగా ముస్తాబైన విమానాశ్రయాలకు బహుమతులు ప్రకటించగా.. అందులో రేణిగుంట ఎయిర్ పోర్టు రెండో బహుమతిని సొంతం చేసుకుంది.ఈ విషయాన్ని  విమానాశ్రయ ఏపీడీ పుల్లా అధికారికంగా ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే.. భారతీయ విమానాశ్రయ ఆధితప్యం ఆధ్వర్యంలో రెండో కేటగిరీ విమానాశ్రాయలకు దీపావళి పురస్కరించుకొని అలంకరణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దేశంలోని వివిధ విమానాశ్రయాలు పోటీపడగా.. రేణిగుంట ఎయిర్ పోర్ట్ రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఏపీడీ పుల్లా మాట్లాడుతూ.. తిరుపతి విమానాశ్రయం గరుడ పక్షి ఆకారంలో ఉండటంతో.. తాము విమానాశ్రయాన్ని దీపావళి పండుగ రోజున ఎల్‌ఈడీ దీపాలతో అలంకరించామన్నారు.

విమానాశ్రయం లోపల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ముగ్గులు వేశామన్నారు. ప్రయాణికుల మెట్లు, ఎస్కలేటర్‌ వద్ద ఉన్న హ్యాంగర్ల వద్ద రంగురంగుల వస్త్రాలతో అలంకరించామని చెప్పారు.విమానాశ్రయం ఎదుట పార్కింగ్‌ ప్రదేశంలోని జాతీయ జెండాకు మల్టీకలర్‌ లైటింగ్‌ సౌకర్యం ఏర్పాటుచేశామన్నారు. పండుగ రోజు ఇక్కడ రాకపోకలు సాగించిన ప్రయాణికులకు మిఠాయిలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశా మన్నారు. విమానాశ్రయం లోపల ఉన్న శ్రీ మహవిష్ణువు దశవాతరాల చిత్రాలను దీపాలతో అలంకరించామని చెప్పారు.

గతంలో 2015-16 రాష్ట్ర పర్యాటక శాఖ ఉత్తమ విమానాశ్రయం ఫ్రెండ్లీ అవార్డు కేటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు..

 

click me!