పెట్రోల్ బంకుల మూసివేత

First Published Nov 2, 2017, 12:53 PM IST
Highlights
  • కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెట్రోెల్ బంకుల మూసివేత
  • ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా ఆయిల్ పెట్రోల్ బంక్ లను మూసివేశారు. ఇంధన కంపెనీలు లక్ష్యాలను విధించడాన్ని నిరసిస్తూ బంక్  యజమానులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగానే పెట్రోల్ బంక్ లను మూసివేశారు.

వివరాల్లోకి వెళితే..  ఇంధన కంపెనీలు.. పెట్రోల్ బంక్ యజమాన్యానికి కొన్ని లక్ష్యాలు విధించాయి. ఆ లక్ష్యాలను బంక్ లు చేరుకోలేకపోయాయి. దీంతో ఇంధన కంపెనీలు.. పెట్రోల్ సరఫరాని నిలిపివేశాయి. దీనికి ఆగ్రహించిన బంక్ యజమానులు ఆందోళన మొదలుపెట్టారు. వెంటనే సరఫరా మొదలుపెట్టకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని బంక్ యజమానులు హెచ్చరించారు. ప్రస్తుతం ఐవోసి బంక్ లను మూసివేయగా.. ఇంధన కంపెనీల తీరు మారకుంటే.. బీపీ,  హెచ్ పీ పెట్రోల్ బంక్ లను కూడా మూసివేస్తామని వారు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వీరికి ఇతర జిల్లాల పెట్రోల్ బంక్ యజమానులు కూడా మద్దతు పలికారు. ఇంధన సంస్థలు ఈ రోజు సాయంత్రం లోగా సమస్యను పరిష్కరించకుంటే.. 13 జిల్లాల్లో బంద్ చేపడతామని చెప్పారు. ఐవోసీ బంకుల మూసివేతతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.

click me!