కాంగ్రెస్ లో మళ్లీ పండగ

First Published Dec 22, 2017, 1:45 PM IST
Highlights

కాంగ్రెస్ మాజీ  సిఎం అశోక్ చవన్ ప్రాసిక్యూషన్ సిఫార్స్ ను కొట్టేసిన బాంబే హైకోర్టు

కాంగ్రెస్ ను, మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఆదర్శ్‌ కుంభకోణంలో మాజీ ముఖ్యమత్రి అశోక్‌ చవన్‌కు భారీ ఊరట లభించింది. ఇది కాంగ్రెస్ పార్టీ పండగే. ఎందుకంటే, గుజరాత్ లో రాహుల్ నాయకత్వం పనిచేసిందని సంబరపడుతున్నపుడు 2జి స్కాం నిందితులంతా నిర్దోషులని తేలింది. ఇపుడు పార్టీ మహారాష్ట్ర నేత కు ఉరట లభించింది. అశోక్ చవన్ ని ప్రాసెక్యూట్‌ చేయాలన్నగవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు సిఫార్స్ ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. బిజెపిని అధికారంలోకి తెచ్చిన కుంభకోణాలకు కోర్టు ఎదురుదెబ్బ తగులుతూ ఉంది అన్ని చోట్లా. 

మహారాష్ట్ర మాజీ సిఎం కేసులో  కూడా సిబిఐ యే దోషిగా నిలబడింది.

ఈ దర్యాప్తులో సీబీఐ సాక్ష‍్యాలు సమర్పించకపోవటంతోచవన్ ను  తిరిగి విచారించేందుకు గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను చవన్‌ హైకోర్టులో సవాల్ చేశారు.

దీనిపై శుక్రవారం కోర్టు ఉత్తర్వలు జారీ చేస్తూ గవర్నర్ సిఫార్స్ ను కొట్టివేసింది.

2010లో ఆదర్శ్ హౌజింగ్ సోసైటీ స్కాం వెలుగులోకి  వచ్చింది.  ఇందులో తన పేరుప్రస్తావన కురావడంతో చవన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ స్థానంలో పృథ్వీరాజ్‌ సింగ్ చౌహాన్  సీఎంగా పగ్గాలు చేపట్టాడు. ఆపై జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఈ కుంభకోణం  గురించి బాగా ప్రచారం చేసి ఎన్నికల్లో నెగ్గింది. అధికారంలోకి వచ్చింది.

చవన్ 2008  డిసెంబర్ నుంచి 2010 నవంబర్ దాకా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. అదర్శ స్కాం దెబ్బతో దిగిపోయారు.

 

 

 

 

 

 

 

 

 

click me!