ఈ ‘మహీంద్ర’ బాహుబలి విజయగాథను కూడా చదవండి

First Published May 4, 2017, 8:23 AM IST
Highlights

రాజమౌళి చూపించిన మహీంద్ర బాహుబలి ఎవరో తెలుసు కానీ, ఈ ‘మహేంద్ర’ బాహుబలి ఎవరు... ఏంటీ ఈయన ప్రత్యేకత  అని తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే..

ఈయన పేరు సునీల్. ఉండేది కేరళలో.. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ పొట్టపోసుకుంటున్నాడు.

 

ఈయనకూ ఓ కల ఉంది. కానీ, దాన్ని నెరవేర్చుకునేందుకు కాసులు లేవు. అంతమాత్రాన ఆయన మనలా డీలా పడిపోలేదు. ఇంతకీ ఆయన కల ఏంటంటే ఓ పెద్ద కారు కొనుక్కోవాలని.... అందూలో ఊరంతా తిరగాలని..

 

కానీ, ఆ కల నెరవేర్చుకోనేంత డబ్బు తన వద్ద లేదని తెలిసి ఓ ఐడియా వేశాడు. తనకున్న ఆటోనే రీ మోడలింగ్ చేశాడు. అది కూడా తనకు నచ్చిన మహీంద్ర స్కార్పియోలా..

 

ఇంకేముంది ఆ మహీంద్ర స్కార్పియోలాంటి ఆటోలో ఊరంతా రయ్య్ రయ్య్ మని తిరిగాడు.

ఇది గమనించి ఆయన ఆటోను ఫొటో తీసి ఓ వ్యక్తి ట్విటర్ లో పెట్టాడు. అక్కడి నుంచి ఆ ఫొటో లైక్ లు షేర్ లతో మహీంద్ర వాహన సంస్థ యజమాని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వరకు వచ్చింది.

 

ఆయనకు సునీల్ ఐడియా బాగా నచ్చింది. వెంటనే ఆ ఆటో స్కార్పియోపై మనసు పారేసుకున్నాడు. దాన్ని తన మ్యూజియంలో పెట్టుకుంటాను కానీ, ఆ ఆటో స్కార్పియో వాలా అడ్రస్ చెప్పండి అంటూ ట్విట్టర్ లోనే రెక్వెస్ట్ చేశాడు.

 

ఓ వారం రోజులకు సునీల్ అడ్రస్ ను మహీంద్ర కంపెనీ వాళ్లు పట్టుకోగలిగారు. ఇంకే ముంది ఆయన వద్దనున్న మూడు చక్రాల స్కార్పియోను ఆనంద్ మహేంద్ర తీసుకొని నిజమైన స్కార్పియో వాహనాన్ని సునీల్ కు గిఫ్ట్  గా ఇచ్చాడు. ఇలా సునీల్ తన కలను నిజం చేసుకున్నాడు.

 

click me!