దిమ్మతిరిగే ఆఫర్లు ప్రకటిస్తున్న ఆర్ కామ్

Published : Jul 31, 2017, 01:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
దిమ్మతిరిగే ఆఫర్లు ప్రకటిస్తున్న ఆర్ కామ్

సారాంశం

సంవత్సర కాలం పాటు రోజుకి ఒక జీబీ డేటా రిలయన్స్ 4జీ సిమ్, 4జీ డేటా కార్డ్

 

రిలయన్స్ జియో తాకిడిని తట్టుకునేందుకు ఇతర టెలికాం సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు  వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ కోవలోకి రిలయన్స్ కమ్యూనికేషన్స్( ఆర్ కామ్) కూడా చేరింది.

డాంగిల్స్ ద్వారా డేటాను ఉపయోగించే వారికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.5,199 చెల్లించి  డాంగిల్ ని కనుక  కొనుగోలు చేస్తే.. సంవత్సర కాలం పాటు రోజుకి ఒక జీబీ డేటాను వినియోగించుకోవచ్చు.

‘రిలయన్స్ బండిల్ ఆఫర్’ పేరిట ఇచ్చిన ఈ ఆఫర్ లో రిలయన్స్ 4జీ సిమ్, 4జీ డేటా కార్డ్ ని అందజేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను Rcom-Eshop.com వెబ్ సైట్ లో పొందుపరిచారు. అంతేకాదు దీనిని  ఈఎంఐ విధానం ద్వారా నెలకు రూ.500 పే చేస్తూ కూడా ఈ సేవలను పొందవచ్చు. ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో నైనా 3,6,9,12,18,24 నెలలో ఈఎంఐ ద్వారా ఈ ఆఫర్ ని సొంతం చేసుకోవచ్చు. ఈ డాంగిల్ తో ఒకేసారి 31మంది హాట్ స్పాట్ తో వైఫై కనెక్ట్ అవ్వవచ్చని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !