
ఉద్దానం కిడ్నీ సమస్య కు ఒక పరిష్కారం కనుగొనేందుకు జనసేన నాయకుడుపవన్ కల్యాణ్ చొరవ తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
‘ ఈ సమస్య 30 ఏళ్లుగా ఆ ప్రాంతాన్ని పీడిస్తూ వుంది, వ్యాధికి సరైన కారణాలు ఇతమిత్ధంగా ఇంతవరకు కనుగొనలేకపోయారు, ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. వ్యాధిగ్రాస్థులకు ఉపశమనం కల్పించే అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుంది. పవన్ కల్యాణ్ ఈ అంశంపై చొరవ తీసుకోవడం ముదావహం, హార్వార్డ్ వైద్య పరిశోధక బృందం ఇచ్చే విలువైన సూచనలు పరిగణనలోకి తీసుకుని ఉభయులం సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం,’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై జనసేన నేత పవన్ కల్యాణ్, హార్వర్డ్ వైద్య బృందంతో కలసి ముఖ్యమంత్రితో వెలగపూడి సచివాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖప్రిన్సిపల్ శాఖ పూనం మాలకొండయ్య ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులోని విశేషాలు...
*కిడ్నీ వ్యాధిగ్రస్థులను గుర్తించి ముందస్తుగా వ్యాధి నివారణ చేపట్టడానికి 7 మండలాల్లో 15 ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు.
*ఒక వైద్యుడు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, టెస్టింగ్ కిట్స్‌తో కూడిన బృందాలు
*176 గ్రామాల్లోని 30 ఏళ్ల పైబడిన అందరికీ ఈ వైద్య బృందాల ద్వారా వైద్య పరీక్షలు
*15.4.2017 వరకు ఈ వైద్య బృందాల ద్వారా 1,01,593 వైద్య పరీక్షల నిర్వహణ
*వీరిలో 13,093 మందికి వ్యాధి ఉన్నట్టు నిర్ధరణ. వీరిలో 7,032మంది పురుషులు, 6,003మంది మహిళలు. మొత్తం జనాభాలో 13 శాతం మందికి వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ.
*కిడ్నీ వ్యాధి చికిత్స నిమిత్తం ఉద్ధానం ప్రాంతంలో 3 ప్రత్యేక డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు
మరో 14 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు
*శ్రీకాకుళం జిల్లాలోని అన్ని కమ్యూనిటీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కిడ్నీ వ్యాధి నిపుణుల నియామకం
దీని ద్వారా బాధితులు విశాఖ కేజీహెచ్‌కు వెళ్లవలసిన అవసరం లేకుండా ఎక్కడికక్కడే రోగ నిర్ధారణ, చికిత్సలు
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కిడ్నీవ్యాధిపై సమగ్ర పరిశోధన
వి.కొత్తూరు మండలంలోని గునుపల్లి గ్రామంలో అధ్యయనం జరిపిన ఎయిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ సంజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం
సమావేశంలో ఉద్ధానం కిడ్నీ సమస్య్య పరిష్కారానికి తాము జరిపిన అధ్యయనం, సిఫారసులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రజెంటేషన్ ఇచ్చింది.