శ్వేత నాగుని చూశారా..?

Published : Jul 31, 2017, 03:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
శ్వేత నాగుని చూశారా..?

సారాంశం

ఆస్ట్రేలియాలో తెలుపు రంగు పాము ప్రత్యక్షం జన్యులోపమే కారణం

 

నలుపు.. ఆకుపచ్చ.. రంగులలో ఉండే పాములను చూసే ఉంటారు.. మరి ఎప్పుడైనా మల్లెపువ్వు అంత తెల్లగా ఉండే పాముని చూశారా... ఆస్ట్రేలియాలో ఇప్పుడు అలాంటి పామే ఒకటి ప్రత్యక్షమైంది. పలువురిని ఆకర్షిస్తున్న ఈ పాము వివరాలు ఇలా ఉన్నాయి..

సాధారణంగా ఈ పాము డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండాలట. దానిలో తలెత్తిన జన్యు పరమైన సమస్యల కారణంగానే అది అలా తెలుపు రంగులో ఉందని వైల్డ్ లైఫ్ పార్క్ నిర్వాహకులు తెలిపారు. ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతంలో తిరుగుతున్న ఈ పాముని స్థానికులు గుర్తించారు. అనంతరం దానిని వైల్డ్ లైఫ్ పార్క్ నిర్వాహకులకు అప్పగించారు. వారు ఆ పాముని ప్రస్తుతం ప్రదర్శనకు ఉంచారు.

అంతేకాకుండా ఈ పాము ఫోటోలను పార్క్ నిర్వాహకులు తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !