కర్నూలు నగరం మధ్యనే వెెలివాడ

Published : Jul 31, 2017, 02:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కర్నూలు నగరం మధ్యనే వెెలివాడ

సారాంశం

పల్లెటూర్లే కాదు పట్టణాలైనా సరే దళిత వాడలు వెలివాడలే, అవి కాలక్రమంలో నగరం మధ్యకు చేరినా నేటికీ సమస్యలకు నిలయాలే.  పట్టణ బుదువార పేట దానికి సాక్ష్యం

పల్లెటూర్లే  కాదు పట్టణాలైనా సరే దళిత వాడలు వెలివాడలే, అవి కాలక్రమంలో నగరం మధ్యకు చేరినా నేటికీ సమస్యలకు నిలయాలే.  పట్టణ బుదువార పేట కర్నూలు కలెక్టర్ గారి కార్యాలయానికి చాలా దగ్గరున్న పేట. దాని వెనకనే హంద్రీ నది వెల్తుంది. ఏండ్లకేండ్లుగా కూలి కష్టం పై ఆధారపడి బతుకుతూ చిన్న చిన్న ఇండ్లల్లో కాపురాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్బాటంగా చేపట్టిన స్వచ్చ భారత్ మరుగుదొడ్ల నిర్మాణం ఇక్కడ పనిచేయలేదు ఎందుకంటే ఉండేందుకే స్థలం తక్కువ కాబట్టి. అయితే కార్పోరేషన్ వారు ఒక అడుగు ముందుకేసి మహిళలకు సామూహిక మరుగుదొడ్లు నిర్మించి మంచిచేసారు. కానీ పురుషులను హంద్రీపట్టుకుని వెల్లమని వదిలేశారు. హంద్రీ వెంట ముల్లకంపలు పొదల్లా పెరగడంతో ఉదయం పూట పని కానిస్తున్నా రాత్రిపూట వనికిస్తున్నాయి. పొదల మాటున పెద్ద పెద్ద పాములు తిరుగుతూ కబడ్దారు నీ పేదరికానికి తోడు నా కాటుతో ని బతుకునే నాశనం చేస్తానంటూ నిరంతరం హెచ్చరిస్తూనే వున్నాయి.

*31-07-17 న కెవిపిఎస్  నాయకత్వం దళిత పేటను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.*

*వెంటనే కార్పోరేషన్ అధికారులు స్పందించి పేటకు వెనకగా హంద్రీ వెంటవున్న ముళ్ల పొదలను తొలగించి పాముల బారినుండి ప్రజలను రక్షించాలి.*

*పురుషులకు కూడా సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలి*

*దళిత పేటను సందర్శించిన వారిలోకెవిపిఎస్  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, నగర అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మన్ నరసింహులు, నాయకులు సుధాకర్, రాముడు, రామకృష్ణ వున్నారు.*

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !