ప్రాణాలకు ముప్పు

Published : Dec 27, 2016, 06:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ప్రాణాలకు ముప్పు

సారాంశం

దివంగత ముఖ్యమంత్రి జయ మరణం తర్వాత కేంద్రం తమిళనాడుపై కక్షసాధింపు చర్యలకు దిగినట్లు ఆయన ఆరోపించారు.

తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ అరెస్టు వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ రామ్మోహన్ చెప్పటం పలు వివాదాలకు దారితీస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయ మరణం తర్వాత కేంద్రం తమిళనాడుపై కక్షసాధింపు చర్యలకు దిగినట్లు ఆయన ఆరోపించారు.

 

జైలు నుండి మంగళవారం ఉదయం విడుదలైన రామ్మోహన్ అక్కడే మీడియాతో మాట్లాడారు. జయ బ్రతికి ఉంటే కేంద్రం తనపై ఐటి, సిఆర్పిఎఫ్ దాడులు చేయించే సాహంస చేసేదేనా అని ప్రశ్నించారు. తన ఇంటిపై దాడులు చేసిన సిబిఐ, ఐటి అధికారులకు ఏమి దొరికిందని నిలదీశారు.

 

తన ఇంట్లో రూ. 1. 12 లక్షలు, 50 తులాల బంగారు ఆభరణాలు, 25 కిలోల వెండి మాత్రమే దొరికిందన్నారు.

 

తన ఇంట్లో సోదాలు చేయటానికి వచ్చిన వారు కనీసం తన పేరు కూడా లేకుండానే నోటీసులు తేవటమేమిటంటూ ధ్వజమెత్తారు. తన కుమారిని పేరుపైన ఉన్న నోటీసులను పట్టుకుని తన ఇంట్లో సెర్చ్ చేయటాన్ని ఆయన తప్పుపట్టారు.

 

తన ఇంట్లో సీక్రెట్ గది ఉందని, అందులో వేల కోట్ల రూపాయలు, కోట్లు విలువచేసే బంగారం దొరికిందని జరుగుతున్న ప్రచారం అంతా ఉత్త కల్పనగా కొట్టేసారు. తన ఇంట్లో సెర్చ్ చేసిన తర్వాత అధికారులకు తాను చెప్పినవి మాత్రమే దొరికినట్లు ఐటి అధికారులు ఇచ్చిన పంచనామా అంటూ కొన్ని కాగితాలను చూపారు.

 

శేఖర్ రెడ్డి తనకు పరిచయస్తుడు మాత్రమేనన్నారు. ఆయనతో తనకు ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని స్పష్టం చేసారు. రాష్ట్రంలో తనకు వేలాదిమందితో సన్నిహిత సంబంధాలున్నాయని కూడా చెప్పటం గమనార్హం. ప్రధాన కార్యదర్శిగా  జయలలిత చెప్పింది మాత్రమే చేశానన్నారు.

 

తనను బదిలీ చేయకుండానే తన స్ధానంలో మరొకరిని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తుందంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు. బదిలీ ఉత్తర్వులు కూడా ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి దైర్యం లేదన్నారు. కాబట్టి ఇప్పటికీ తానే తమిళనాడు ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా  రామ్మోహన్ చెప్పుకోవటం విశేషం. తనకు జరిగిన అన్యాయంపై ప్రజాకోర్టులో వివరిస్తానన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !